కరోనా మహమ్మారి సమయంలో బీజేపీ జాతి విద్వేషాలు రెచ్చగొడుతోంది: సోనియా గాంధీ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) మీటింగ్ గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సోనియా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుందంటూ వ్యాఖ్యలు

కరోనా మహమ్మారి సమయంలో బీజేపీ జాతి విద్వేషాలు రెచ్చగొడుతోంది: సోనియా గాంధీ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) మీటింగ్ గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సోనియా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ గ్రేవ్ డామేజి చేసి సామాజిక భద్రతను దూరం చేస్తుంది. తాము ప్రతి భారతీయుడ్ని, జరిగిన ప్రతి నష్టాన్ని బాగు చేస్తామని చెప్పారు సోనియా.

‘ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. భారతీయుడిగా ప్రతి ఒక్కరం బాధపడాల్సిన విషయమిది. మనం సంయుక్తంగా పోరాడితేనే మహమ్మారిని ఎదుర్కోగలం. బీజేపీ మాత్రం మత విద్వేషాలను రెచ్చగొడుతూ పోతుంది. మన సమాజానికి గ్రేవ్ డ్యామేజి సృష్టిస్తుంది. మన పార్టీ ఆ డ్యామేజీని పూడ్చటానికి బాగా కృషి చేయాలి’ అని అన్నారు.

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, ఇతర ప్రధాన కాంగ్రెస్ లీడర్లంతా వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ మూడు వారాల్లో కాంగ్రెస్ టాప్ డెసిషన్ మేకింగ్ టీం మీటింగ్ అవడం ఇది రెండో సారి. లాక్‌డౌన్ గురించి తర్వాత మాట్లాడొచ్చు కానీ, కొవిడ్-19ను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో ముందు చెప్పాలని ప్రశ్నించారు.

సోనియా గాంధీ లాంటి టాప్ లీడర్లంతా వారి కంప్లైంట్లను మరోసారి సంధించారు. కరోనా వైరస్ కేసులను గుర్తించడానికి సరైన టెస్టింగులను ప్రభుత్వం చేయడం లేదంటూ ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వం అందజేస్తున్న PPEకిట్లు నాణ్యత లోపాలను, కొరతను ప్రశ్నించారు సోనియా.