కుళ్లిన పండ్లతోనే కడుపు నింపుకుంటున్న వలస కూలీలు

లాక్ డౌన్.. వారిని రోడ్ల పాలు చేసింది. గుక్కెడు బువ్వ దొరక్క ఆహారం కోసం అలమటిస్తున్నారు. బతుకు దెరువుకు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

కుళ్లిన పండ్లతోనే కడుపు నింపుకుంటున్న వలస కూలీలు

లాక్ డౌన్.. వారిని రోడ్ల పాలు చేసింది. గుక్కెడు బువ్వ దొరక్క ఆహారం కోసం అలమటిస్తున్నారు. బతుకు దెరువుకు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సొంతూరికి వెళ్లలేక ఉన్నచోట తిండి దొరక్క ఆహారం కోసం అలమటిస్తున్నారు. ప్రతిరోజు తినడానికి ఆహారం దొరక్క ఖాళీ కడుపులతోనే పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఒక రోజు ఆహారం దొరికినా అది సరిపోవడం లేదని సగం ఆకలితోనే ఉండాల్సి వస్తోందని అంటున్నారు. వీధి వ్యాపారాలు పారబోసిన కుళ్లిన పండ్లతోనే వలస కూలీలు కడుపు నింపుకుంటున్నారు. వ‌ల‌స కూలీల కోసం ఢిల్లీ ప్రభుత్వం వ‌స‌తి, భోజ‌న సౌక‌ర్యాలు కల్పిస్తోంది. గంట‌లు కొద్ది క్యూలో నిల‌బ‌డితేనే వలస కూలీలకు బుక్కెడు బువ్వ దొరికే ప‌రిస్థితి. అందుకే దొరికిందే తింటూ సగం ఆకలితోనే అలమటిస్తున్నారు. ఆకలి మంటను చల్లార్చుకోవడం కోసం కొందరు కూలీలు రోడ్లపై పడేసిన పండ్లను ఏరుకుని మళ్లీ ఆకలి తీర్చుకుంటున్నారు.

మరోవైపు కరోనా రక్కసి కోరలు విప్పింది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ కారణంగా సొంతూళ్లకు వెళ్లలేని వలస కూలీలంతా ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు.

అప్పటినుంచి లాక్ డౌన్ కష్టాలు పడుతున్నారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగిస్తుంది.. సొంతూళ్లకు తిరిగి వెళ్లొచ్చులేని అనుకుంటే.. మళ్లీ లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించింది కేంద్రం. దీంతో ఆకలి కష్టాలతో వలస కూలీలు అవస్థలు దయనీయంగా మారిపోయాయి. (మలేరియా మందు కరోనాపై పనిచేస్తుందా? తెలుసుకోవాల్సిన వాస్తవాలు)

ఈ విషయం వెలుగులోకి రావడంతో ఢిల్లీ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. వలస కార్మికుల కోసం ప్రత్యేక వసతి, ఆహార సదుపాయాలను కల్పించినట్టుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.