కేరళ ఆరోగ్య మంత్రి శైలజపై యూఎన్ ప్రశంసలు

కేరళ ఆరోగ్య మంత్రి శైలజపై యూఎన్ ప్రశంసలు

cరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజను ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ‘నిపా యువరాణి’ మరియు ‘కోవిడ్ రాణి’ అని పిలవవచ్చు. ఆమె పనిని కేవలం పిఆర్ ఎక్సర్ సైజ్ అని ఎగతాళి చేయవచ్చు. కానీ COVID-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో ఆమె చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కెకె శైలాజా చేసిన ప్రయత్నాలను ప్రపంచం గమనించింది.

కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో కేరళ కృషిని ఐక్యరాజ్య సమితి కొనియాడింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజతో పాటు ఇతర నాయకులను ప్రశంసించింది. మంగళవారం పబ్లిక్‌ సర్వీస్‌ డే(జూన్-23,2020)ను పురష్కరించుకుని కరోనాను ఎదుర్కోవటంతో ప్రపంచ వ్యాప్తంగా విశేష కృషి చేసిన వారిని ఐక్యరాజ్య సమితి అభినందించింది. ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ మాట్లాడుతూ.. నిఫా వైరస్‌, 2018-19 సంవత్సరాలలో వచ్చిన రెండు వరదలను ఎదుర్కోవటంలో ఆరోగ్య శాఖ కీలక పాత్రను పోషించింది. ఆ అనుభవమే కోవిడ్‌-19 నియంత్రణ కోసం ఉపయోగపడింది. వూహాన్‌లో కరోనా కేసులు నమోదైన వెంటనే కేరళ అప్రమత్తం అయింది. తగిన విధంగా చర్యలు తీసుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రేటు 12.5, మరణాల రేటు 0.6గా ఉందని శైలజ తెలిపారు.

కేరళ అనుసరించిన వ్యూహాన్ని వివరించిన శైలజ…వైరస్ వ్యాప్తి మరియు మరణాలను తగ్గించడంపై దృష్టి పెట్టామన్నారు. “ట్రేసింగ్, క్వారంటైన్, టెస్ట్, ఐసొలేట్ చేయడం మరియుట్రీట్మెంట్ అందించడం “, “బ్రేక్ ది చైన్” మరియు “రివర్స్ క్వారంటైన్ ” అనే మూడు వ్యూహాలను అనుసరించినట్లు శైలజ తెలిపారు. ప్రభుత్వ నాలుగు వైపుల వ్యూహం ప్రభావవంతంగా పనిచేసిందని ఆరోగ్య మంత్రి తెలిపారు. మహమ్మారి మొదలైన 142 రోజుల తరువాత కూడా, 6.5 లక్షలకు పైగా ప్రజలు సర్వైలెన్స్ లో ఉన్నారని, ఇంపోర్టెడ్ కేసులను గుర్తించి ఐసోలేటె చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Read: కరోనా సేవలో కొత్త జంట : రోగులకు ఆక్సిజన్ సిలిండర్స్..బెడ్స్ విరాళంగా ఇచ్చిన వధూవరులు