టెక్నాలజీ మాయ : డీప్ ఫేక్ ఫోర్న్ వీడియోలు

డీప్ ఫేక్..ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతోంది. కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కానీ వీటిని కొంతమంది ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడుతున

టెక్నాలజీ మాయ : డీప్ ఫేక్ ఫోర్న్ వీడియోలు

డీప్ ఫేక్..ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతోంది. కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కానీ వీటిని కొంతమంది ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తాజాగా డీప్ ఫేక్ సృష్టిస్తున్న మాయాజాలంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. తాము కాదు..బాబోయ్ అంటూ మొత్తుకొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఇటీవలే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్..మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారనే వీడియో ఎంత హల్ చల్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. తర్వాత అది ఫేక్ అని తేలింది. తమకు నచ్చిన సెలబ్రెటీల శరీరానికి సామాన్యుల ముఖాన్ని అంటించి..తప్పుడు సందేశాలు, అసభ్య వీడియోలు సృష్టిస్తున్నారు. డీప్ ఫేక్‌ను వాడుకుని సెలబ్రెటీల ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు సందేశాలు, అసభ్య వీడీయోలు సృష్టించి..వీటిని వైరల్ చేస్తున్నారు.

అందులో ఉన్నది తాము కాదని..నిరూపించుకోవడానికి వారు అష్టకష్టాలు పడుతున్నారు. మీ ముఖంలో ప్రముఖుల ముఖం అమర్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాప్ట్ వేర్. ఎవరూ గుర్తు పట్టకుండా..స్పష్టంగా..నాణ్యంగా ఫొటోలు అందించడం దీని స్పెషాల్టీ. ఇందులో ఇంకో విచిత్రం ఏమిటంటే..ఆ ప్రముఖుల గొంతుతోనే వీడియో వస్తుంది. మీరు ఎంపిక చేసిన సెలబ్రెటీ ముఖం..మీరు ఏదైతే..ఎంపిక చేయాలని అనుకున్న ముఖ కవలికలను ముందే పసిగడుతుంది.

మీ బాడీకి ఏ సెలబ్రెటీ శరీరం సూట్ అవుతుందో..సరిగ్గా చూపిస్తుంది. ఇలా అయిపోగానే..మీరు ఏదో వీడియోను చేసి..అందులో మీకు నచ్చిన సందేశాన్ని ఇచ్చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ ముఖంపై ఎంపిక చేసుకున్న ప్రముఖ ఫేస్ ఇంపోజ్ అవుతుంది.

దీనికి సంబంధించిన సాప్ట్ వేర్లను అందించే యాప్‌లు అనేకం ఉన్నాయి. అయితే..ఈ యాప్‌‌లను కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. ప్రస్తుతం టెక్నాలజీలో జరుగుతున్న మోసాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల మరింత ఇబ్బందులు తలత్తే ప్రమాదం ఉందని..వీటిని నిషేధించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

డీప్ ఫేక్ అంటే ఏమిటీ ? 
డీప్ ఫేక్ టెక్నాలజీ సహాయంతో..వీడియో కంటెంట్‌ను కళ్లకు కట్టినట్లుగా కనిపించేలా..వినిపించేలా..తయారు చేయవచ్చు. ఒక వ్యక్తి ముఖ హావభావాలు, గొంతు అనుకరించడం వంటివి చేసి ఆ వ్యక్తి తనకు తానుగానే మాట్లాడుతున్నట్లు ఫేక్ కంటెంట్ తయారు చేయవచ్చన్నమాట.

ఈ టెక్నాలజీని ఎక్కువగా బ్లూ ఫిలిమ్స్‌లో వాడుతుంటారు. అత్యాధునిక సాంకేతికత ఉండడం వల్ల..ఈ డీప్ ఫేక్ వీడియోలను ప్రజలు కనుక్కొలేనంత కచ్చితత్వంతో రూపొందిస్తున్నారు. నకిలీ వీడియోలను అస్సలు తెలియవు. డీప్‌గా చూస్తేనే అర్థమౌతుంది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో డీప్ ఫేక్ వీడియోలు అతిపెద్ద ప్రమాదకరంగా మారాయి.

Read More : అందుకే ఎన్నికలు వాయిదా : జగన్ ఆరోపణలపై రమేశ్ కుమార్ కౌంటర్