త్రిపురలో కరోనా : NO MASK..NO VEGETABLE

భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్న పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా సోకుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ

త్రిపురలో కరోనా : NO MASK..NO VEGETABLE

భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్న పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా సోకుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ 19 కారణంగా మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు స్వచ్చందంగా సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

కానీ..కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. త్రిపుర రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ అయిన మహరాజ్ గంజ్ బజార్ లో వ్యాపారులు కొత్త నిబంధన అమల్లోకి తెచ్చారు. ప్రతి దుకాణం వద్ద NO MASK..NO VEGETABLE బోర్డులు పెడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు పదే పదే సూచించినా..కొంతమంది వినియోగదారులు నిబంధనలు పాటించడం లేదని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. దీంతో ఈ నిబంధన పెట్టాల్సి వచ్చిందంటున్నారు.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోందని, దీనిని అరికట్టడానికి సోషల్ డిస్టెన్స్ పాటించడమే బెటర్ అని అంటున్నారు. తన దుకాణాకి వచ్చే వినియోగదారులు మాస్క్ ధరించకపోతే..కూరగాయలు ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పడం జరుగుతోందని మరో వ్యాపారి వెల్లడించారు. ఇతర వ్యాపారస్తులు ఇదే విధంగా ఆచరిస్తే..చాలా లాభం ఉంటుందన్నారు. ఈ విషయం మార్కెట్ అసోసియేషన్ కు తెలిసింది.

సభ్యులందరూ ఇలాంటి ప్ల కార్డులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. పెద్ద మార్కెట్ లో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే వార్త హల్ చల్ చేసింది. తాము కూడా ఇదే విధంగా చేయాలని ఇతర మార్కెట్ వ్యాపారస్తులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆయా మార్కెట్ ల వద్ద పోలీసులు, ఇతరులు రద్దీని నియంత్రిస్తున్నారు. అయినా..మార్కెట్ లోకి వెళ్లిన తర్వాత దగ్గర, దగ్గరగా నిలబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా..వివిధ మార్కెట్ లను పెద్ద పెద్ద స్టేడియాలకు తరలించింది ప్రభుత్వం.