పెళ్లి రోజున కోవిడ్ 19 రోగులకు సేవ చేసిన డాక్టర్ జంట

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.  కరోనా వ్యాధి గ్రస్తుల సేవలో డాక్టర్లు తలమునకలై ఉన్నా

పెళ్లి రోజున కోవిడ్ 19 రోగులకు సేవ చేసిన డాక్టర్ జంట

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.  కరోనా వ్యాధి గ్రస్తుల సేవలో డాక్టర్లు తలమునకలై ఉన్నారు. జార్ఖండ్ లో ఒక డాక్టర్ జంట తమ పెళ్లిరోజు వార్షికోత్సవాన్ని కూడా పట్టించుకోకుండా కరోనా సోకిన వ్యక్తులకు చికిత్సను అందించటంలో మునిగిపోయారు. ఇది వారికి వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను తెలియచేస్తోంది.

డాక్టర్ రితికా, డాక్టర్ నిశాంత్ పాథక్ జంట వారి  పెళ్లి రోజును రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో గడిపారు. అక్కడ వారు కోవిడ్-19 సోకిన వారికి చికిత్సను అందించారు.

కోవిడ్ 19 రోగులకు సేవలను అందించిన ఈ జంటపై రాష్ట్ర ప్రజలు  ప్రశంసల వర్షం కురింపించారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీలాంటి వారు కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతూ, అంకిత భావంతో సేవలను అందిస్తూ, వారికి ధైర్యాన్ని, జీవితాన్ని ఇస్తున్నారని సోరెన్ ఒక ట్వీట్ లో తెలిపారు.

అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులకు, పారా మెడికల్ సిబ్బంది అందరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. పెళ్లి రోజు వార్షికోవత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ  జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ డాక్టర్ దంపతులను అభినందించారు.