బ్రా వేసుకోలేదని గోల చేశారుగా.. ఇప్పుడు రెండేసుకున్నా: నటి కామెంట్లు

నెటిజన్ల కామెంట్లకు సెన్సారే ఉండదు. కాస్త నచ్చలేదంటే నిర్మొహమాటంగా, ఫ్రాంక్‌గా చెప్పేస్తుంటారు. ఎదురుగా ఉండి చెప్పాలంటే ధైర్యం కావాలి. కానీ, సోషల్ మీడియాలో కామెంట్ చేయడమేముంది. 2సె

బ్రా వేసుకోలేదని గోల చేశారుగా.. ఇప్పుడు రెండేసుకున్నా: నటి కామెంట్లు

నెటిజన్ల కామెంట్లకు సెన్సారే ఉండదు. కాస్త నచ్చలేదంటే నిర్మొహమాటంగా, ఫ్రాంక్‌గా చెప్పేస్తుంటారు. ఎదురుగా ఉండి చెప్పాలంటే ధైర్యం కావాలి. కానీ, సోషల్ మీడియాలో కామెంట్ చేయడమేముంది. 2సెకన్లలో పని. ఈ కామెంట్లకు విసిగిపోయిన నటి, టెలివిజన్ షో హోస్ట్ కమ్ చెఫ్ పద్మాలక్ష్మి అదిరిపోయే రిప్లై ఇచ్చారు.

కొద్ది రోజులు ఆమె టాప్ చెఫ్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తుననారు. ఇందులో భాగంగా ఇటీవల చేసిన ట్యూటోరియల్ ఎపిసోడ్‌లో బ్రా వేసుకోకుండా కనిపించారు. కుకింగ్ ట్యూటీరియల్ మొత్తం అలానే ఉండటంతో నెటిజన్ల నుంచి దారుణంగా ట్రోలింగ్ కు గురి కావాల్సి వచ్చింది. క్వారంటైన్లో ఇంట్లో ఉన్నప్పుడు కూడా బ్రా వేసుకోవాల్సిన అవసర్లేదని అందుకే అలా ఉన్నానని బదులిచ్చారు.

అంతేకాకుండా మీ లాంటి వాళ్ల కోసమే ఇలా వచ్చానంటూ రెండు బ్రాలు వేసుకున్నానని చూపించారు. దాంతో పాటు మరో వార్నింగ్ ఇచ్చారు. మహిళల శరీరాలను చెక్ చేయకుండా ఉంటే మంచిది. బ్లూ క్రాప్ టాప్ వేసుకుని తన పదేళ్ల కూతురు కృష్ణాతో పాటు షో షూట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.. మరి.

లాక్ డౌన్ టైంలో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితం అవడంతో వారు హాబీలను వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పద్మలక్ష్మి తనకు ఎదురైన ట్రోలింగ్స్ ఘాటు రిప్లై ఇచ్చారు. కానీ, మిగిలిన వారంతా మనకెందుకులే అని వదిలేస్తుంటారు.

Also Read | Netflix, Amazon Prime Video, Disney+ Hotstarలలో స్పెషల్ షోలు