మంత్రికి సోకిన కరోనా…. నెగెటివ్ వచ్చిన కొద్ది రోజులకే పాజిటివ్

మహారాష్ట్రలో ఓ పోలీస్ అధికారి నుంచి మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సెక్యూరిటీ స్టాఫ్

మంత్రికి సోకిన కరోనా…. నెగెటివ్ వచ్చిన కొద్ది రోజులకే పాజిటివ్

మహారాష్ట్రలో ఓ పోలీస్ అధికారి నుంచి మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సెక్యూరిటీ స్టాఫ్ కు కరోనా సోకడంతో మంత్రితోపాటు ఆయన కుటుంబ సభ్యులు వారం రోజులు హోం క్వారంటైన్ లో ఉన్నారు. అనంతరం కరోనా టెస్టులు చేయించుకోగా నెగెటివ్ గా నిర్ధారణ అయింది. కానీ నెగెటివ్ వచ్చిన కొద్ది రోజులకే మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జితేంద్ర భద్రతా సిబ్బందితోపాటు ఇంట్లో పని చేసే వంట మనిషి, పార్టీ కార్యకర్తలకు కూడా కరోనా వైరస్ సోకింది.

అయితే మంత్రి జితేంద్ర లాక్ డౌన్ పరిస్థితులపై సమీక్షించేందుకు ముంబ్రా పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఓ సీనియర్ పోలీస్ అధికారితో సమావేశం అయ్యారు. గతవారం పోలీసు అధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మంత్రికి కూడా కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సదరు పోలీసు అధికారి నుంచి సుమారు 100 మందికి పైగా కరోనా సోకినట్లు ముంబాయి పోలీసులు భావిస్తున్నారు.

తబ్లీగ్ జమాత్ సభ్యులను గుర్తించడంలో పోలీసు అధికారి కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా వారు ఉన్న ప్రాంతాల్లో పర్యటించి వారిని పట్టుకున్నారు. వీరి నుంచి పోలీసు అధికారికి కరోనా వ్యాపించింది. ఆ తర్వాత పోలీస్ అధికారిని దాదాపు వంద మంది కలిసి ఉంటారు. ఈ వంద మందిలో పలువురు నాయకులు, జర్నలిస్టులు, పోలీసులు ఉన్నారు. అలాగే ముంబ్రా పోలీస్ స్టేషన్ సిబ్బందిని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.