మాస్కులు కుడుతున్న రాష్ట్రపతి భార్య

COVID-19 ఇన్ఫెక్షన్‌తో పోరాడేందుకు.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా ఒక్కటిగా నడుస్తోంది. తప్పనిపరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు తప్పనిసరిగా వాడాల్సిందే. కేంద్ర ప్రభుత్వం సొంతగా మాస్కులు తయారుచేసుకోవాలంటూ పిలుపునివ్వడంతో రాష్ట్రపతి భార్య సరితా కోవింద్ కూడా మాస్కులు కుడుతున్నారు.

బుధవారం శక్తి హాత్‌లో  ఉన్న ప్రెసిడెంట్ ఎస్టేట్‌లో మాస్క్ లు కుడుతున్న ఫొటో మీడియాలోకి వచ్చింది. ఢిల్లీ అర్బజన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ లోని షెల్టర్ హోమ్స్ కు వీటిని పంపిణీ చేస్తారు. ఈ మాస్కులు కుడుతున్న సమయంలో సరితా కోవింద్ ముఖానికి ఎర్ర గుడ్డ కట్టుకుని కనిపించారు. మార్చి నెలారంభంలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ కూడా తన ఒక నెల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్ కు డొనేట్ చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు.

ఇటీవల విడుదల చేసిన గైడ్ లైన్స్ లో హోం వ్యవహరాల శాఖ బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు, పని చేసుకునే ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ ముఖాలకు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించింది. సామాజిక దూరం పాటిస్తూ.. ముఖాలకు మాస్క్ లు అడ్డుపెట్టుకోవాలని వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బేసిక్ మాస్క్ ల కంటే మూడు పొరలుగా ఉన్న క్లాత్ సర్జికల్ మాస్క్ లు, N95/N99మాస్కుల కొరత బాగా కనిపిస్తుంది.