మే 3 తర్వాత కూడా సడలింపులుండవు.. బస్సులు, రైళ్లు, విమానాలు తిరగవు

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొ

మే 3 తర్వాత కూడా సడలింపులుండవు.. బస్సులు, రైళ్లు, విమానాలు తిరగవు

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొనసాగిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని, లాక్ డౌన్ పై నిర్ణయం తెలుపుతారని సమాచారం. అయితే మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువ అని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

కంటైన్‌మెంట్‌, రెడ్‌జోన్ ప్రాంతాల్లో మే 3 తర్వాత లాక్ డౌన్:
కంటైన్‌మెంట్‌, రెడ్‌జోన్ ప్రాంతాల్లో మే 3 తర్వాత కూడా ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం(ఏప్రిల్ 29,2020) మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వస్తున్న కేసులు ఎక్కువగా రెడ్, హాట్‌స్పాట్ ప్రాంతాల నుంచి వస్తున్నాయన్నారు. చాలా రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు కేంద్రం సూచించిన విధంగా మినహాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు.

కరోనా కట్టడికి కేవలం సామాజిక దూరమే మాత్రమే విరుగుడన్నారు. కాగా డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు. గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని, గ్రీన్‌జోన్ ఏరియాలో పరిశ్రమలు, మిగతా అన్ని పనులు చేసుకోవచ్చని వెల్లడించారు. సడలింపులు ఉ‍న్న ప్రాంతాల్లో కూడా సామాజిక దూరం, మాస్కులు తప్పక ధరించాలని స్పష్టం చేశారు. పరిస్థితుల ఆధారంగా గ్రీన్ జోన్లలో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తామన్నారు కిషన్ రెడ్డి.
బస్సులు, రైళ్లు, విమానాలు తిరగవు:
ప్రజా రవాణా సేవలపైనా కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ప్రారంభించే అవకాశమే లేదన్నారు. మే 3 తర్వాత కూడా బస్సులు, విమానాలు, రైళ్లు నడవవని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏ రాష్ట్ర ప్రజలైనా.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారిని సొంత రాష్ట్రాలకు తీసుకుపోవచ్చని ఆయన తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని కూడా తీసుకురావడానికి చర్చలు సాగుతున్నాయన్నారు. లక్షలాది మంది ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు.