మే3కు ఫైనల్ కాదా.. మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు.. ?

కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యావత్ దేశమంతా సమష్ఠిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌లను సైతం తూ.చా తప్పకుండా పాటిస్తు

మే3కు ఫైనల్ కాదా.. మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు.. ?

కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యావత్ దేశమంతా సమష్ఠిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌లను సైతం తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు ప్రజలు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 30వరకూ పొడిగించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్ 30 నుంచి మే 3వరకూ జరిగింది.

అక్కడితో ఫైనల్ అనుకుని ఆశాభావం వ్యక్తం చేస్తున్నవాళ్లకు నిరాశ తప్పేట్టుగా లేదు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పనులు చూస్తుంటే అలా కనిపించడం లేదు మరి. ముందుగా చెప్పినట్లు ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి. మే 3 తర్వాత నుంచి డొమెస్టిక్ దేశీ ప్రయాణాలు చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి విదేశీ ప్రయాణాలకు అనుమతులు ఉంటాయి.

కాకపోతే ప్రత్యేక షరతులతో కూడిన అనుమతులు ఉన్నాయని చెప్పింది. ప్రభుత్వం మాట విని రెడీ అయిపోయిన ఎయిర్‌లైన్స్ టిక్కెట్ బుకింగ్లు, అమ్మకాలు మొదలెట్టేశాయి. కానీ, అనూహ్యంగా టిక్కెట్ అమ్మకాలు ఆపేయండంటూ సూచనలు ఇస్తుంది గవర్నమెంట్.

విమాన సర్వీసుల్లో టాప్ అయిన IndiGo, జూన్ 1నుంచి టిక్కెట్ల అమ్మకాలు మొదలెట్టనుంది. Singapore Airlines Ltd, SpiceJet Ltd, Go Airlines India Ltd, Air India Ltd, AirAsia India, Malaysia’s AirAsia Group Bhdలకు సంబంధించిన ప్రయాణాలు ఆపేయమంటూ వస్తున్న సూచనలను అస్సలు పట్టించుకోవడం లేదు.

మరోసారి మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ అవ్వనున్నారు. ఏప్రిల్ 27న జరగనున్న ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయంపైనే లాక్‌డౌన్ గడువు ఆధారపడి ఉంటుంది. పీఎం సమావేశమైన ప్రతిసారి పొడిగింపు వార్త వస్తుండటంతో ఈ సారి ఏ తేదీ వరకూ పొడిగిస్తారోననేది సందేహం. ఇదిలా ఉంటే మే నెలాఖరు వరకూ పొడిగించి జూన్ 1తో యథాతథంగా జరుగుతాయంటూ రూమర్లు వినిపిస్తున్నాయి.

వరసగా ఓ వారం రోజులైన కేసుల నమోదు తగ్గితే లాక్‌డౌన్ ఎత్తేస్తారనుకోవడం సబబే. కానీ, రాష్ట్రవ్యాప్తంగా రోజూ పదులలో కేసులు పెరుగుతుండటం, దేశానికి తలనొప్పిగా మారింది. ఇప్పటితో లాక్‌డౌన్ ఎత్తేస్తే ఇన్ని రోజులు పాటించిన జాగ్రత్తలన్నీ వృథా అయిపోతాయని భయపడుతున్నారు అధికారులు.