రివకరీ రేటు తక్కువ..మరణాలెక్కువ..కరోనా పోరాటంలో చేతులెత్తేస్తున్న నగరాలు….  

రివకరీ రేటు తక్కువ..మరణాలెక్కువ..కరోనా పోరాటంలో చేతులెత్తేస్తున్న నగరాలు….  

బాధితులు రావడమేకాని… రికవరయ్యి వెళ్లేవాళ్లు తక్కువే. అందుకే హాస్పటల్ బెడ్స్ నిండిపోతున్నాయి. పేరుకు మెట్రోలేకాని..  మరణాలు రేటు ఎక్కువ. అందుకే ప్రభుత్వాలకు టెన్షన్. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పదిరోజుల్లో  containment zones ను రెండింతలు చేశారు. ఈ జోన్స్‌‍లో ప్రతి ఒక్కరికీ టెస్టింగ్ చేయాలని ఉన్నా…. చాలాచోట్ల అనుకున్నంత మేర టెస్టింగ్ సదుపాయాల్లేవ్. మరేం చేయాలి? రోజురోజుకి నగరాలు బందీఖానాల్లా మారిపోతున్నాయి. అయినా పరిస్థితి ఇంకా అదుపులోకి రావడంలేదు.

ఒక్క కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో రికవరీ రేటు తక్కువే. దేశం మొత్తం మీద కరోనా నుంచి బాగుపడినవాళ్ల శాతం 19. ఇదేసమయంలో ముంబై, అహ్మదాబాద్, ఇండోర్, జైపూర్ నగరాల్లో రికవరీ రేటు తక్కువ… పదిలోపే. జైపూర్, ఇండోర్‌‌ల్లో రివకరీ రేటు 8శాతం కన్నా తక్కువే. ఇక మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రికవరీరేటు మరీ దారుణం..6 శాతం.

దేశంలోనే ఎక్కువ కేసులు, మరణాలున్న ముంబైలో పరిస్థితి కాస్త మెరుగు. దాదాపు 13శాతం. బాగా  పనిచేస్తున్నఢిల్లీ రికవరీ రేటు అన్ని నగరాలకన్నా ఎక్కువ. 32 శాతంతో కరోనా పోరాటంపై భరోసానిస్తోంది. రికవరీ రేటు తక్కువకాగానే ఉందికాబట్టే,  Pune, Indore,Ahmedabad,Mumbai మరణాల రేటు కూడా ఎక్కువగా  కనిపిస్తోంది. అంటే..జాతీయ స్థాయి కన్నా ఎక్కువ. ఇదేంటి? మెట్రోలనగానే… వైద్యపరంగా సర్వహంగులు, ప్రభుత్వ నియంత్రణ బాగానే ఉంటుంది కదా? మరి ఈ నగరాలెందుకు కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నాయ్? గ్రామాలెందుకు సేఫ్‌గా ఉన్నాయి?

కరోనా దెబ్బ బాగా తగిలిన ఆరు నగరాల్లో ఢిల్లీ బాగా పనిచేస్తోంది. ఇక్కడ ఎక్కువ రికవరీ రేటు, తక్కువ మరణాలు నమోదవుతున్నాయి. గుజరాత్ మోడల్ అని గొప్పగా చెప్పుకొనే అహ్మదాబాద్ పరిస్థితి దారుణం. 1501 పేషెంట్లలో కేవలం 86 మంది మాత్రమే బాగుపడి డిశ్చార్జ్ అయ్యారు. అంటే రివకరీ రేటు 5.7శాతం . చాలా తక్కువ రేటు కిందే లెక్క. దీనికి కారణం, ఆలస్యంగా బాధితులను గుర్తించడం కావచ్చు.

అప్పటికే వ్యాధి ముదిరి రికవరీ కష్టం కావచ్చు. వాళ్లు చనిపోవచ్చుకూడా. బహుశా ఆలస్యం, ఆలసత్వం వల్లనే గుజరాత్ ఒక్కసారిగా కరోనా కేంద్రంగా మారిపోయినట్లుంది. కేంద్ర బృందాలు ఇప్పటికే ఇండోర్, జైపూర్‌లకెళ్లాయి. అక్కడ తగినంతగా టెస్ట్‌లు చేయట్లేదు, టెస్ట్ చేయాల్సిన కేసులు పేరుకుపోతున్నాయని ఆందోళనచెందాయి. ఇది చాలావరకు నిజమే.