సంపన్నులపై కరోనా ఎఫెక్ట్ : 40 శాతం పన్ను వేయాలని సూచనలు

కరోనా వైరస్ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తోంది. ఎన్నో రంగాలు కుదేలయిపోతున్నాయి. భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఎన్నో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, వ్యాపారాలు మూతబడ్డాయి.

సంపన్నులపై కరోనా ఎఫెక్ట్ : 40 శాతం పన్ను వేయాలని సూచనలు

కరోనా వైరస్ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తోంది. ఎన్నో రంగాలు కుదేలయిపోతున్నాయి. భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఎన్నో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, వ్యాపారాలు మూతబడ్డాయి. ఆర్థికరంగం తీవ్రంగా నష్టపోతుండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. అయినా..కొంతమంది..సంపన్నుల ఆదాయంలో మాత్రం తేడా రావడం లేదంట. తాత్కాలికంగా ఆదాయం పెంచుకొనేందుకు అధిక సంపద కలిగిన వారిపై 40 శాతం పన్ను, విదేశీ కంపెనీలపై అధిక లెవీ విధించాలంటూ కేంద్రానికి కొందరు సీనియర్ అధికారులు సూచించారనే వార్త హల్ చల్ చేస్తోంది.

ఫోర్స్ పేరిట ఒక నివేదికను CBDT ఛైర్మన్ పీసీ మోదీకి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (IRS) సమర్పించింది. రూ. కోటికి పైగా ఆదాయం కలిగిన వారిపై ప్రస్తుతం 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. దీనిని 40 శాతం చేయాలని సూచించిందని సమాచారం. ఇక రూ. 5 కోట్లు పైబడి ఆదాయం ఆర్జించే వారిపై తిరిగి సంపద పన్నును ప్రవేశపెట్టాలని సూచించిందని తెలుస్తోంది. కానీ ఈ నివేదికను ప్రభుత్వం అధికారిక అభిప్రాయంగా పరిగణించరాదని CBDT స్పష్టం చేసింది.

దేశంలోని విదేశీ సంస్థల నుంచి అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని, సర్ ఛార్జీని పెంచుకోవాలని వెల్లడించారు. పన్నులు, సెస్సులు అయల్లోకి తెస్తే..రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 18 వేల కోట్లు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే..IRS అధికారుల సూచనలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. ఈ క్రమంలో సీబీడీటీ సైతం దీనికి విచారణకు ఆదేశించడం గమనార్హం. తమ అనుమతి లేకుండా…ఐఆర్ఎస్ అధికారులు పన్ను విషయాల్లో జోక్యం చేసుకున్నారని, ఈ నివేదికను ఎవరెవరు రూపొందించారు ? ఎవరు ఆదేశించారనేది తెలుసుకుంటున్నట్లు సమాచారం.