Jashpur District : దసరా ర్యాలీలో ప్రమాదం..భక్తులపైకి దుసుకెళ్లిన కారు..ఒకరు మృతి

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లా లో ఇవాళ నిర్వహించిన దసరా ర్యాలీలో ప్రమాదం చోటుచేసుకుంది

Jashpur District :  దసరా ర్యాలీలో ప్రమాదం..భక్తులపైకి దుసుకెళ్లిన కారు..ఒకరు మృతి

Chattisgarh

Jashpur District  ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లాలో ఇవాళ నిర్వహించిన దసరా ర్యాలీలో ప్రమాదం చోటుచేసుకుంది. పాతాల్ గావ్ లోని రాయ్ ఘడ్ రోడ్డులో  దుర్గా మాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న భక్తులపైకి  ఓ కారు వేగంగా దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,20మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం పాతల్‌గావ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని పాతాల్ గావ్ కు చెందిన 21 ఏళ్ల గౌరవ్ అగర్వాల్ గా గుర్తించారు.

భక్తులను ఢీకొట్టిన తర్వాత 100-120 స్పీడ్ తో దగ్గర్లోని షుక్రాపరా వైపు కారు దూసుకెళ్లింది. అయితే స్థానికులు కారుని వెంబడించారు. ఈ క్రమంలోనిందితులు కారుని రోడ్డు పక్కన వదిలేసి పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన కారుని స్థానికులు తుగులబెట్టారు. కారులో పెద్ద మొత్తంలో గంజాయి ఉన్నట్లు తెలుస్తోంది.

జష్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి అందిన సమాచారం ప్రకారం..కారు ప్రమాద ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో బబ్లూ విశ్వకర్మ(21),శిశుపాల్ సాహు(26)ఉన్నారు. నిందితులిద్దరూ మధ్యప్రదేశ్ కు చెందినవారు. చత్తీస్ ఘడ్ మీదుగా వారు ప్రయాణిస్తున్నారు.