COVID-19 Vaccine: కొవిడ్ పూర్తి డోసు వేసుకుంటే మద్యంపై 10శాతం డిస్కౌంట్

మెగా వ్యాక్సిన్ కాంపైన్ లో భాగంగా.. కొవిడ్ వ్యాక్సిన్ పూర్తి డోసుకున్న వారికి 10శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు అధికారులు. బుధవారం ఈ ప్రకటన చేయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే విమర్శలకు...

COVID-19 Vaccine: కొవిడ్ పూర్తి డోసు వేసుకుంటే మద్యంపై 10శాతం డిస్కౌంట్

Liquopr Sales 10

COVID-19 Vaccine: మెగా వ్యాక్సిన్ కాంపైన్ లో భాగంగా.. కొవిడ్ వ్యాక్సిన్ పూర్తి డోసుకున్న వారికి 10శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు అధికారులు. బుధవారం ఈ ప్రకటన చేయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే విమర్శలకు దిగారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెగా కాంపైన్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే మందసౌర్ జిల్లా ఎక్సైజ్ అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సీతామౌ ఫటక్, భునియాఖేదీ, ఓల్డ్ బస్ స్టాండ్ సమీపంలోని మూడు మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసిన పూర్తి డోసు వ్యాక్సినేషన్ హోల్డర్లకు 10శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని ఎక్సైజ్ ఆఫీసర్ అనిల్ సచ్చన్ అన్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మిగిలిన చోట్ల అమలుపరుస్తామని అంటున్నారు.

దీనిపై బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సింగ్ సిసోడియా కామెంట్ చేస్తూ నిర్ణయం సరైంది కాదని అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, మద్యం సేవించడాన్ని ప్రోత్సహించేదిలా ఉందని విమర్శించారు. అంతకంటే ముందు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ మద్యం తీసుకునే వారిని ప్రేరేపించేదిలా నిర్ణయం ఉందని తిట్టిపోశారు.

……………………………….. : చిక్కడపల్లి సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

అర్హత కలిగిన వారందరికీ డిసెంబర్ ముగిసేనాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. ఈ నెల కంటే ముందు జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ ఖండ్వా జిల్లా ఆర్పీ కిరార్ మద్యం కొనుగోలు చేయాలంటే ముందుగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు చూపించాలని అన్నారు.