కరిస్తే ప్రాణాలు పైకే : రైల్లో 10 అడుగుల కింగ్ కోబ్రా.. వీడియో

  • Published By: sreehari ,Published On : November 26, 2019 / 08:20 AM IST
కరిస్తే ప్రాణాలు పైకే : రైల్లో 10 అడుగుల కింగ్ కోబ్రా.. వీడియో

నగర శివారు ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువుతోంది. అడవులు, పొలాల్లో కాదు.. ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నాయి. బెడ్ రూంలోకి రావచ్చు. టాయిలెట్ గదుల్లో ఉండొచ్చు. అన్ని చోట్లలో పాములు స్వైరవిహారం చేస్తున్నాయి. మాములు పాము అయితే పెద్దగా భయపడక్కర్లేదు. అందులోనూ ప్రాణాంతకమైన విషసర్పాలతే ఇంకేమైనా ఉందా? పై ప్రాణాలు పైకి పోవాల్సిందే. అలాంటి ఓ పెద్ద నల్లత్రాచు పాము ఏకంగా రైలు ఎక్కేసింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైల్లోకి ప్రవేశించింది.

అప్పటికే ప్రయాణికులంతా రైలు ఎక్కేశారు. ఇక బయల్దేరడమే ఉంది. ఇంతలో పాము అంటూ పెద్దగా అరుపులు. రైల్లోని ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. రైలు కాంపార్ట్ మెంటులోని డోర్ దగ్గర మాటు వేసి చూస్తోంది. ఎవరు వస్తారా కాటేద్దామా అన్నట్టు కసిగా ఎదురుచూస్తోంది. దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న కింగ్ కోబ్రాను చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. కరిచిందా? ప్రాణాలు పోవాల్సిందే. అత్యంత ప్రాణాంతకమైన ఈ నల్లత్రాచు పామును చూసి ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరి ప్రాణాలకు హాని జరగలేదు.

వెంటనే రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. రెస్య్కూ టీంకు సమాచారం అందించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.. కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ఖత్గోడమ్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్, ఆర్పీఎఫ్ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ఎంతో నేర్పుతో గంటలకొద్ది వ్యవహరించారు. ఎట్టకేలకు కింగ్ కోబ్రాను పట్టుకుని అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశారు. కింగ్ కోబ్రాను పట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో…