Gujarat : బ్రేకింగ్, గుజరాత్‌‌లో ఘోర ప్రమాదం, 10 మంది మృతి

గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మినీ ట్రక్కు - కారు ఢీకొనడంతో పది మంది చనిపోయారు.

Gujarat : బ్రేకింగ్, గుజరాత్‌‌లో ఘోర ప్రమాదం, 10 మంది మృతి

Gujarat : దేశంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం నిత్యకృత్యమై పోయింది. ఎక్కడో ఒక చోట ఆక్సిడెంట్స్ జరుగుతున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అతి వేగంగా ప్రయాణించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఇతరులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

ట్రక్కు, కారు ఢీకొనడంతో పది మంది దుర్మరణం చెందారు. ఆనంద్ జిల్లాలో 2021, జూన్ 16వ తేదీ బుధవారం ఉదయం కారులో కొంతమంది వెళుతున్నారు. ఇంద్రనాజ్ సమీపంలోకి (తారాపూర్ – ఆనంద్ జిల్లాకు అనుసంధానిచ్చే జాతీయ రహదారి) రాగానే..అత్యంత వేగంగా వస్తున్న ట్రక్కు..కారును అమాంతం ఢీకొట్టిందని తారాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. కారులో పది మంది ఉన్నారని, వీరందరూ చనిపోయారని తెలిపారు.

చనిపోయిన వారిలో ఓ చిన్నారి కూడా ఉందన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. కారు వాటమన్ వైపు వెళుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. వీరిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది