Ants Eating Cashews: చీమలు పట్టిన జీడిపప్పు తిని వాంతులు చేసుకున్న యువకులు.. వీడియోకు 10మిలియన్ల వ్యూస్..

జీడిపప్పు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ.. వాటిని తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. అందుకే దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తారు.

Ants Eating Cashews: చీమలు పట్టిన జీడిపప్పు తిని వాంతులు చేసుకున్న యువకులు.. వీడియోకు 10మిలియన్ల వ్యూస్..

Cashews Covered With Ants

Ants Eating Cashews: జీడిపప్పు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ.. వాటిని తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. అందుకే దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తారు. వంటకాల్లోనూ జీడిపప్పును విరివిగా వినియోగిస్తారు. పలు విధాలుగా జీడిపప్పును ఉపయోగించి ఇష్టంగా తింటుంటారు. తాజాగా చీమలు పట్టిన జీడిపప్పును తిన్న యువకులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఏకంగా 10మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Cashews : గుండె ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పు!

కొంతమంది యువకులు జీడిపప్పు ప్యాకెట్ ను  తినడం ప్రారంభించారు. ప్యాకెట్ లోపల చూసుకోకుండా తినడంతో అందులోని చీమలను సైతం తినేశారు. తీరా ప్యాకెట్ సగం ఖాళీ అయిన తరువాత చూస్తే జీడిపప్పులో చీమలు కనిపించాయి. ‘లోపల ఏముందో పరీక్షించకుండానే ఈ జీడిపప్పును ఒక నిమిషం పాటు తిన్నాం’ అంటూ చీమలు ఉన్న జీడిపప్పు వీడియోను యువకులు ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. అయితే ఈవీడియోలో జీడిపప్పును చీమలు పట్టినట్లు కనిపిస్తుంది. అంతేకాక ఈ జీడిపప్పు తిన్న ఓ వ్యక్తి వాంతులు చేసుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 10 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. మూడు వేల మందికిపైగా సరదాగా, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు.

 

 

View this post on Instagram

 

A post shared by RedCup News (@redcupnews)

ఓ నెటిజన్ తన కామెంట్లో.. చీమలతో మీకు మంచి ప్రొటీన్ అందింది.. అయినా వాటిని ఎందుకు చూసుకోలేదు అంటూ పేర్కొన్నారు. పర్వాలేదులే.. చీమలతో మీకు మంచి ప్రొటీన్ అందింది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. నేను ఒకసారి నూడుల్స్‌లో చిన్న చీమలను గమనించకుండా ఉడికించి తిన్నాను. నేను మా అమ్మకు కూడా వాటిని తినిపించాను అన్నాడు. మరో నెటిజన్ ‘నేను ఒక సారి చీకటిలో తాగి, వేరుశెనగ వెన్న, జామ్ శాండ్‌విచ్ చేసాను. నేను పూర్తి చీమలతో తింటున్నాను అని నాకు సగం వరకు అర్థం కాలేదు అంటూ పేర్కొన్నాడు.