బీజేపీ బ్రహ్మాస్త్రం : ఎన్నికలకు ఓసీ రిజర్వేషన్ శంఖారావం

డీ పాపులారిటీ తగ్గిపోతుండటం కూడా ఈ చారిత్రక నిర్ణయం వెనుక ఓ కారణంగా చెప్పవచ్చు అని

  • Edited By: veegamteam , January 7, 2019 / 10:04 AM IST
బీజేపీ బ్రహ్మాస్త్రం : ఎన్నికలకు ఓసీ రిజర్వేషన్ శంఖారావం

డీ పాపులారిటీ తగ్గిపోతుండటం కూడా ఈ చారిత్రక నిర్ణయం వెనుక ఓ కారణంగా చెప్పవచ్చు అని

మరో నాలుగు నెలల్లో సాధారణ ఎన్నిల షెడ్యూల్ రాబోతున్నది. సరిగ్గా ఈ టైంలోనే జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కంచుకోటలు అయిన మూడు రాష్ట్రాల్లో ఓడిపోయి.. ఫైనల్స్ కు రెడీ అవుతుంది. ఇలాంటి టైంలో ఆలస్యం చేయటం మంచిది కాదని నిర్ణయించి మోడీ సర్కార్.. ముందస్తుకి వెళ్లాలనే ఆలోచన కూడా చేస్తోంది. ఫిబ్రవరి మధ్యలోనే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో మోడీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. చడీచప్పుడు లేకుండా.. కనీసం లీకులు కూడా లేకుండా అగ్రకులాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ ఆమోదం కూడా పొందింది. గంటల వ్యవధిలోనే పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేశారు. శీతాకాల సమావేశాల్లోని పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి గెజిట్ కు సిద్ధం అయిపోయింది ఈ బిల్లు. దేశ చరిత్రలో ఇంత ఫాస్ట్ గా ఓ బిల్లు కేబినెట్ ఆమోదం, పార్లమెంట్ లో చర్చ జరిగిన దాఖలాలు లేవు. మోడీ తలచుకున్నాడు.. అంతే అయిపోయింది.

రిజర్వేషన్ల విషయంలో మోడీ నిర్ణయం..అగ్రవర్ణాల్లోని పేదలను తమ వైపు తిప్పుకుని ఎలాగైనా 2019 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకుంది. నాలుగేళ్లుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అగ్ర కులాలు రిజర్వేషన్లు కల్పించాలని పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహించాయి. ఈ ఆందోళనల్లో కొంతమంది చనిపోయారు కూడా. ఓ సమయంలో మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాలని భావిస్తోందని ప్రచారం కూడా జరిగింది. అయితే గుజరాత్, రాజస్థాన్ లో అగ్ర కులాల ఉద్యమాల సమయంలో నోరు మొదపని మోడీ.. కేవలం 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ చారిత్రక నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. బీజేపీ కుంచుకోటలుగా ఉన్న చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారం దక్కించుకోవడం బీజేపీకి నిద్ర లేకుండా చేస్తుంది. రాహుల్ ప్రభావం పెరుగుతూ, మోడీ పాపులారిటీ తగ్గిపోతుండటం కూడా ఈ చారిత్రక నిర్ణయం వెనుక ఓ కారణంగా చెప్పవచ్చు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని కొన్ని రోజులుగా బీజేపీ వర్గాల నుంచి లీకులు బయటికొస్తున్నాయి. మోడీ ప్రాభవం తగ్గక ముందే ఎన్నికలకు వెళ్లి 2014 సీన్ రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మోడీ రాష్ట్రాల పర్యటనలు, 10 శాతం రిజర్వేషన్ నిర్ణయం, రైతు రుణమాఫీ నిర్ణయాలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రైతులకు మోడీ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అగ్రకులాల ఓటు బ్యాంకును పూర్తిగా తన వైపు తిప్పుకోవాలనేది బీజేపీ వ్యూహం. ఇది జరగాలి అంటే ఒకే ఒక్క దారి బీజేపీ ఎదుట ఉంది. అదే అగ్రకులాలకు రిజర్వేషన్లు. ఎన్నోఏళ్లుగా తరచుగా తెరపైకి వచ్చే డిమాండ్ ఇది. దీన్ని అమలు చేసేసి.. అగ్రకులాల్లోని యువతను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ బ్రహ్మాస్త్రం అని.. ముందస్తు ఎన్నికలకు అగ్రకులాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్ల ద్వారా శంఖారావం పూరించినట్లే అంటున్నారు. మోడీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం చూస్తుంటే.. ముందస్తు ఖాయంగానే కనిపిస్తోంది.