10ఏళ్ల జైలు,రూ.1లక్ష ఫైన్..మతమార్పిడి నిరోధక బిల్లుకి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం

మతమార్పిడులను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పెళ్లి పేరుతో లేదా ఇతర మోసపూరిత కారణాలతో జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం(మార్చి-8,2021) ఆమోదం తెలిపింది.

10ఏళ్ల జైలు,రూ.1లక్ష ఫైన్..మతమార్పిడి నిరోధక బిల్లుకి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం

religious conversion మతమార్పిడులను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పెళ్లి పేరుతో లేదా ఇతర మోసపూరిత కారణాలతో జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం(మార్చి-8,2021) ఆమోదం తెలిపింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియ‌న్ బిల్లు2021ని మార్చి-1న రాష్ట్ర హోంశాఖ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా శాసనసభలో ప్రవేశపెట్టగా..ఇవాళ దీనిపై చర్చ ముగిసిన అనంతరం మూజువాణీ ఓటు ద్వారా ఆ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో గతేడాది డిసెంబర్‌లో ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్‌కు ఇవాళ చట్టరూపు ఇచ్చినట్లయింది. కొత్త చ‌ట్టం ప్ర‌కారం..పెళ్లి ద్వారా కానీ, ఇత‌ర ప‌ద్ద‌తుల్లో మ‌త మార్పిడుల‌కు పాల్ప‌డిన వారికి ప‌దేళ్ల వరకు జైలుశిక్షతోపాటు రూ.1లక్ష వరకు జ‌రిమానా విధిస్తారు.

కాగా,గా మత మార్పిడి నిరోధక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఈ తరహా 23 కేసులు నమోదైనట్టు గత నెలలో హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించిన విషయం తెలిసిందే. భోపాల్ డివిజ‌న్‌లో ఏడు, ఇండోర్‌లో అయిదు, జ‌బ‌ల్‌పూర్‌లో నాలుగు, గ్వాలియ‌ర్‌లో మూడు కేసులు న‌మోదు అయిన‌ట్లు మంత్రి తెలిపారు.