Cycle Polo Player Nida Fathima Dies : 10 ఏళ్లకే సైకిల్ పోలో క్రీడాకారిణి నిదా ఫాతిమా హఠాన్మరణం..
ఎన్నో ఆశలతో ఆశయాలతో క్రీడారంగంలో అడుగు పెట్టిన 10 బాలిక హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. సైకిల్ పోలో క్రీడాకారిణి జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలకు నాగ్ పూర్ వెళ్లిన నిదా ఫాతిమా అక్కడే మృతి చెందింది.

Cycle Polo Player Nida Fathima Dies : ఎన్నో ఆశలతో ఆశయాలతో క్రీడారంగంలో అడుగు పెట్టిన 10 బాలిక హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. సైకిల్ పోలో రంగంలో ఎన్నో ఘనతలు సాధించాల్సిన 10 ఏళ్ల నిదా ఫాతిమా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బుధవారం (డిసెంబర్21,2022) రాత్రి వికారంతో వాంతులు చేసుకున్న ఫాతిమను వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు గురువారం మృతి చెందింది. కేరళకు చెందిన నిదా నాగ్ పూర్ లో జరుగుతున్న జాతీయ సైకిల్ ఛాంపియన్ షిప్ అండర్ 14 పోటీల్లో నిదా పాల్గొనాల్సి ఉంది. ఈ పోటీల కోసం నిదా ఫాతిమా కొన్ని రోజుల క్రితమే నాగ్ పూర్ చేరుకున్నారు.
ఈక్రమంలో బుధవారం రాత్రి నిదా అస్వస్థకు గురి కావటం ఆస్పత్రికి తీసుకువెళ్లటంతో చికిత్స పొందుతూ నిదా మృతి చెందింది. కేరళలోని అలప్పుజాకు చెందిన 10 ఏళ్ల సైకిల్ పోలో క్రీడాకారిణి నిదా ఫాతిమా హఠాత్తుగా మరణించటంతో కేరళ క్రీడారంగం అంతా దిగ్ర్భాంతి వ్యక్తంచేసింది. నిదా నాగ్‌పూర్‌లో జరుగుతున్న జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్‌షిప్ అండర్-14 పోటీల్లో నిదా పాల్గొనాల్సి ఉంది. కేరళకు చెందిన రెండు సంఘాల సభ్యులు చాంపియన్‌షిప్ కోసం కొన్ని రోజుల క్రితం నాగ్‌పూర్ చేరుకున్నారు. ఛాంపియన్‌షిప్ గురువారం ప్రారంభం కావాల్సి ఉంది.ఇంతలోనే నిదా హఠాన్మరణం చెందింది.
Nida had reportedly suffered from nausea and vomiting on Wednesday night and was taken to a hospital where she collapsed. #NidaFathima https://t.co/r0nqh91sFG
— TheNewsMinute (@thenewsminute) December 22, 2022
నిదా హఠాన్మరణం విషయంలో కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మెర్సీ కుట్టన్ మాట్లాడుతూ..కేరళ నుంచి క్రీడాకారులు నాగ్ పూర్ చేరుకోవటానికి మేము అన్ని ఏర్పాట్లు చేశామని కానీ అక్కడికి వెళ్లాక వారి బాధ్యత అంతా అక్కడివారు చూసుకోవాల్సి ఉందని..వారు అక్కడికి చేరుకున్న తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదని.. నిర్వాహకులు వారి అవసరాలను చూసుకోవాలి. మేము నిదా విషయంలో ఏం జరిగిందో ఆరా తీస్తున్నామని తెలిపారు. నిదా మృతదేహాన్ని కేరళకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఛాంపియన్ షిప్ పోటీలకు వెళ్లి నిదా మరణించటంతో తండ్రి తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. వారి స్వస్థలమైన అలప్పుజా నుంచి నాగ్ పూర్ కు చేరుకున్నారు. నిదా మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర సంతాపం తెలిపారు.
10 year old Kerala cycle polo player Nida Fathima dies in Nagpur