మంత్రులు,ఎమ్మెల్యేల కోసం..కరోనా సెంటర్లుగా 100 డీలక్స్‌ రూములు: సామాన్యుల మాటేంటీ?

  • Published By: nagamani ,Published On : June 25, 2020 / 09:47 AM IST
మంత్రులు,ఎమ్మెల్యేల కోసం..కరోనా సెంటర్లుగా 100 డీలక్స్‌ రూములు: సామాన్యుల మాటేంటీ?

మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల సౌకర్యాలతో కరోనా సెంటర్లు అంటూ ఓరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. రోగాలు రావటానికి పేద గొప్పా తేడా లేదు. కానీ..పేదవారికి ఓ రకమైన చికిత్సలు..గొప్పవారికి మరోరకమైన చికిత్సలు మాత్రం ఉంటాయి. ఈరెండింటిలో తేడాలు మాత్రం సమాజంలో పోవట్లేదు. 

ఈ కరోనా కాలంలో కరోనా మహమ్మారి సోకిన పేదలు..సామాన్యప్రజలు అల్లాడిపోతుంటే వారిని చేర్చుకోవటానికి బెడ్లు లేవనీ..ఆక్సిజన్ సిలిండర్లు లేవనీ ఇలా పలు కారణాలతో హాస్పిటల్స్ లో చేర్చుకోవటంలేదు.

ఈ కరోనా కాలంలో కూడా అదే కొనసాగుతోంది.ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునిసామాన్యమానవులు బతుకుతుంటే..ఎక్కడ కరోనా సోకుతుందో..వైద్యం అందక ఎక్కడ చచ్చిపోతామోనని భయపడుతుంటే..మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల సౌకర్యాలతో కరోనా సెంటర్లను ఏర్పాట్లు చేస్తోంది కర్ణాటక ప్రభుత్వం.

కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివాదస్పదంగా మారింది. బెంగళూరులో ఇటీవల పునరుద్ధరించిన కుమార కృప అతిథి గృహంలోని వంద డీలక్స్‌ గదులను కరోనా సోకిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం కేటాయిస్తున్నట్లు బుధవారం (జూన్ 24,2020)న ప్రభుత్వం జారీ చేసిన  ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ వీవీఐపీ అతిథి గృహంలోని లగ్జరీ గదుల భర్తీ 33 శాతం మించకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 

దీంతో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓ వైపు కరోనా సోకిన సాధారణ ప్రజలకు ప్రభుత్వం ఆస్పత్రుల్లో చేర్చుకునేపరిస్థితులు లేక…చేర్చుకున్న ప్రాంతాల్లో సరైన వసతులు లేక అల్లాడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు డీలక్స్‌ గదులను కరోనా కేంద్రాలుగా కేటాయించడాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తమ చర్యను మాత్రం సమర్థించుకుంది.

 కరోనా కష్టకాలంలో అందుబాటులో ఉన్నవాటన్నింటినీ ఉపయోగించుకుంటున్నామంటూ సర్ధిచెబుతోంది. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య పది వేలను దాటగా 164 మరణాలు నమోదయ్యాయి. 

Read: CBSE Exams: 10,12 తరగతి పరీక్షలు రద్దు …అయితే