కోల్డ్ స్టోరేజీలో గడ్డకట్టిన 1000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు

కోల్డ్ స్టోరేజీలో గడ్డకట్టిన 1000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు

Covishield vaccine భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే అసోం రాష్ట్రంలోని కాచర్ జిల్లాలోని సిల్‌చార్ మెడిక‌ల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(SMCH)లో నిల్వ ఉంచిన దాదాపు 1,000 కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గ‌డ్డ క‌ట్టాయి. SMCHలోని వ్యాక్సిన్ స్టోర్ యూనిటల్ లో వ్యాక్సిన్ డోసులు గట్టకట్టి కన్పించాయి.

క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ద్ద నిల్వ చేయాలి. కానీ ఈ మెడిక‌ల్ కాలేజీలో టీకాలు నిల్వ ఉంచిన ప్ర‌దేశంలో ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్‌లోకి వెళ్లిపోవ‌డంతో గ‌డ్డ క‌ట్టిన‌ట్లు తేలింది. ఐస్ లైన్‌డ్ రిఫ్రిజిరేట‌ర్‌(ILR)లో సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే టీకాలు గ‌డ్డ క‌ట్టాయ‌ని అధికారులు తెలిపారు. అయితే ఐఎల్ఆర్‌ను 2- 8 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ల మ‌ధ్య ఉంచుతాం. ఎప్పుడైతే ఉష్ణోగ్ర‌త‌లో మైన‌స్‌లోకి వెళ్లిపోతాయో..ఐఎల్ఆర్ మెషీన్ నుంచి వెంట‌నే సందేశం వ‌స్తుంది. కానీ ఈ సారి అలాంటి మేసేజ్ రాక‌పోవ‌డంతో గ‌మ‌నించ‌లేక‌పోయామ‌ని అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో,రీప్లేస్మెంట్ కింద మ‌రో వెయ్యి డోసుల‌ను సిల్‌చార్ మెడిక‌ల్ కాలేజీకి పంపించాలని అసోం ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వ్యాక్సిన్లు గడ్డకట్టిన ఘటనకు సంబంధించి రిపోర్ట్ కు ఇవ్వాల్సిందిగా హాస్పిటల్ అథారిటీని రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ని కోరింది.