Exams Cancel : బెంగాల్‌లో 10, 12 తరగతుల పరీక్షలు రద్దు..

10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు.

Exams Cancel : బెంగాల్‌లో 10, 12 తరగతుల పరీక్షలు రద్దు..

Exams Cancel

Exams Cancel: 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. కరోనా ఉదృతి అధికంగా ఉన్న నేపథ్యంలో 10, 12 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఆదివారం పశ్చిమ బెంగాల్ లో 7,002 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 107 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,26,132కు చేరింది. రాష్ట్రంలో 16,259 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. మొత్తం 13,74,419 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

అయితే మొదట పరీక్షలు రద్దుచేందుకు మమతా సర్కార్ సుముఖత చూపలేదు.. ఈ నేపథ్యంలోనే పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చారు. జూలై చివరి వారంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు. 10వ తరగతి బోర్డు పరీక్షలు ఆగస్టు రెండో వారంలోనూ జరుపుతామని గతంలో మమతా బెనర్జీ ప్రకటించారు. కానీ కరోనా తీవ్ర అధికంగా ఉండటంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.