బుర్ఖా వేసుకుని గుడిలో శానిటైజేషన్ చేస్తున్న కరోనా వారియర్

  • Published By: Subhan ,Published On : May 8, 2020 / 05:18 AM IST
బుర్ఖా వేసుకుని గుడిలో శానిటైజేషన్ చేస్తున్న కరోనా వారియర్

నార్త్ ఢిల్లీలోని నవదుర్గా టెంపుల్ లో బుర్ఖా వేసుకుని ఓ మహిళ తిరుగుతుంది. ఆమె గుడిని సందర్శించడం కోసం వచ్చిందనుకునేరు. కాదు గుడిని శానిటైజ్ చేసేందుకు వచ్చింది. రెండు నెలలుగా మతపరమైన విద్వేషాల చెలరేగుతున్న నేపథ్యంలో కరోనా సంక్షోభ సమయంలో దాని నుంచి బయటపడాలని ఇలా చేసింది 32ఏళ్ల ఇమ్రానా సైఫీ. 

ఈ క్రమంలోనే ఆమె శానిటైజేషన్ ట్యాంక్ తగిలించుకుని స్ప్రేను పట్టుకుని.. పరిసర ప్రాంతాల్లో శానిటైజ్ చేసింది. గుడులలో, మసీదుల్లో, గురుద్వారా ప్రాంతాల్లో స్ప్రే చేసింది. ముగ్గురికి తల్లి అయిన మహిళ పవిత్ర రంజాన్ నెల ఉపవాసాలు పాటిస్తూనే స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ట్యాంక్‌తో శానిటైజేషన్ చేస్తుంది. 

ఆమె సాయం చేసేందుకు వస్తుంటే.. మత గురువులు సైతం గుడుల్లోకి స్వాగతం పలికారు. CAAపై ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లను శాంతపరచాలని ఏడో తరగతి వరకే చదువుకున్న ఇమ్రానా కృషి చేస్తుంది. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కలిసి కరోనా వారియర్స్ టీం గా రెడీ అయ్యారు. 

జఫ్రాబాద్, చాంద్‌బాగ్, ముస్తఫాబాద్, నెహ్రూ విహార్, శివ్ విహార్, బాబూ నగర్ లలో మసీదు నుంచి వచ్చే అజాన్ లు, గుడి నుంచి వినిపించే గంట శబ్దాలకు ఒకేలా స్పందిస్తామని అంటోంది మహిళ. ‘భారత్ లో ఉన్న సెక్యూలర్ కల్చర్ ను కాపాడాలనుకుంటున్నా. మనమంతా ఒకటే అందరం కలిసి ఉండాలి. అర్చకులు ఆపలేదు, ఏ  మత గురువులు మాకు అడ్డు చెప్పలేదు’ అని చెప్పింది.

ఇమ్రానా భరత నియామత్ అలీ వృత్తిరీత్యా ఒక ప్లంబర్. ఇమ్రానా కూడా ఏదో ఒక పనిచేసుకుంటుంది. లాక్ డౌన్ కారణంగా ఇద్దరికీ పనిలేకుండా పోయింది. సమయం దొరకడంతో కమ్యూనిటీ సర్వీస్ చేయాలని భావించింది. 

Also Read | తెల్లారిన బతుకులు : వలస కూలీల పైనుంచి వెళ్లిన రైలు..15 మంది మృతి