వక్కపొడి (వక్కకాయ) మింగిన చిన్నారి.. బతికించిన సర్జరీ

  • Published By: Subhan ,Published On : May 8, 2020 / 12:19 PM IST
వక్కపొడి (వక్కకాయ) మింగిన చిన్నారి.. బతికించిన సర్జరీ

కొన్ని వస్తువులకు చిన్నపిల్లలను దూరంగా ఉంచడం తప్పనిరి. కాస్త ఏమరుపాటుగా ఉన్న పొరబాట్లుగా జరిగిపోవచ్చు. కొయంబత్తూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఓ 3ఏళ్ల చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు డాక్టర్లు. అనుకోకుండా ఎరెకా నట్(వక్క పొడి వచ్చే కాయ)ను నోట్లో పెట్టుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది.

గోబిచెట్టిపాలయంకు చెందిన చిన్నారిని ముందుగా ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా వైద్యులు చేతులెత్తేశారు. కొయంబత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లమని సూచించారు. కొయంబత్తూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో గురువారం సక్సెస్ ఫుల్ గా సర్జరీ చేసి పసిప్రాణాన్ని కాపాడారు. 

ENT డిపార్ట్‌మెంట్ హెడ్, ప్రొఫెస్ అయిన డాక్టర్ అలీ సుల్తాన్ సర్జరీపై మాట్లాడారు. ‘సమయానికి సర్జరీ చేసి ఉండకపోతే బిడ్డ ప్రాణానికే ప్రమాదం. మనం చిన్నారిని కోల్పోయేవాళ్లం. ఆ కాయను మింగడంతో గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది. శ్వాస తీసుకోవడానికి పూర్తిగా ఇబ్బంది ఏర్పడిందని ఆయన అన్నారు.