డాక్టర్ సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యే పేరు… నాన్ బెయిలబుల్ వారెంట్‌తో అరెస్టు

  • Published By: Subhan ,Published On : May 8, 2020 / 02:29 PM IST
డాక్టర్ సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యే పేరు… నాన్ బెయిలబుల్ వారెంట్‌తో అరెస్టు

రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే పేరును సూసైడ్ నోట్ లో రాసి డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెలలో జరిగిన ఘటనపై ఆ ఎమ్మెల్యేకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఢిల్లీలోని డియోలీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేపై వారెంట్ ఇష్యూ అయింది. పోలీసులు ఈ కేసులో మరో నిందితుడైన కపిల్ నగర్‌కు, ప్రకాశ్ జర్వాల్‌ల గురించి వెదుకుతున్నారు. 

జర్వాల్ కనిపించకుండా పోవడంతో అతని తండ్రి, సోదరులను పోలీసులు విచారిస్తున్నారు. ఏప్రిల్ 18న 52ఏళ్ల డాక్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆ ఒత్తిడుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. జర్వాల్ పై ఎక్స్‌టార్షన్, డాక్టర్ సూసైడ్ చేసుకోవడానికి కారణం కింద కేసు నమోదు చేశారు. 

డాక్టర్ కొడుకు పోలీసులతో తన తండ్రి ఒక క్లినిక్ నడుపుతున్నాడని.. వాటర్ సప్లై బిజినెస్ ను కూడా నిర్వహిస్తున్నాడని 2007నుంచి ఢిల్లీ జల్ బోర్డ్ ఆధ్వర్యంలో వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. ఎమ్మెల్యే పోలీసులతో మాట్లాడుతూ.. తాను అమాయకుడినని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కైనా రెడీగా ఉన్నానని చెప్పాడు. 10నెలలుగా డాక్టర్ తో తాను మాట్లాడలేదని అంటున్నాడు. 

‘నేను కూడా ఈ విషయాన్ని మీడియా ద్వారానే తెలుసుకున్నాను. అతనికి వాటర్ ట్యాంకర్లు ఉన్నాయని, సూసైడ్ చేసుకున్నాడని సూసైడ్ నోట్ లో నా పేరు రాశాడని. నేనొక్కటే చెప్పాలనుకుంటున్నా. నేను అమాయకుడ్ని. 8-10నెలలుగా అతణ్ని కలవలేదు. అతని పేరు 2017లో ట్యాంకర్ మాఫియా  అంటూ మీడియాలో వినిపించింది. 

నన్ను ట్రాప్ చేయడానికి గతంలోనూ ప్రయత్నించారు. ఇప్పుడు కూడా. గతంలో నేను అమాయకుడ్ని అని నిరూపించుకున్నా. మళ్లీ అదే చేస్తా. పోలీసులకు కో ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎటువంటి విచారణకైనా రెడీ’ అని ఎమ్మెల్యే మీడియాతో చెప్పాడు.