Beat Covid 19: వావ్.. అతడికి 105, ఆమెకి 95.. కరోనాను జయించిన వృద్ధుల జంట.. 9రోజుల్లోనే నయం

కరోనా ప్రాణాంతకమే కానీ, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, ధైర్యంగా ఉంటే ఏమీ కాదనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. కరోనాను ఇట్టే జయించొచ్చని తెలుపుతున్నారు. అయినా కొందరిలో భయాలు పోవడం లేదు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే, ఐసీయూలో ఉండాల్సి వస్తే.. ఇక బతకడం కష్టమే అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాంటి వారికి ఈ వృద్ధ జంట సరికొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది.

Beat Covid 19: వావ్.. అతడికి 105, ఆమెకి 95.. కరోనాను జయించిన వృద్ధుల జంట.. 9రోజుల్లోనే నయం

Old Couple Beat Covid 19

Old Couple Beat Covid 19 : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు చెబితే చాలు జనాలు వణికిపోతున్నారు. నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. ఇక కరోనా సోకిందని తెలిస్తే కొందరు.. ఏకంగా తమ ప్రాణాలు పోయినంతగా ఆందోళన చెందుతున్నారు. కరోనా ప్రాణాంతకమే.. కానీ, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, ధైర్యంగా ఉంటే ఏమీ కాదనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. కరోనాను ఇట్టే జయించొచ్చని తెలుపుతున్నారు. అయినా కొందరిలో భయాలు పోవడం లేదు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే, ఐసీయూలో ఉండాల్సి వస్తే.. ఇక బతకడం కష్టమే అనే అభిప్రాయం చాలామందిలో ఉంది.

అలాంటి వారికి ఈ వృద్ధ జంట సరికొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఆ దంపతులు కరోనాను జయించారు. వారి వయసు తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. మహారాష్ట్రకు చెందిన ధెను ఉమాజీ చవాన్ వయసు 105 ఏళ్లు. ఆయన భార్య మోతాబాయి చవాన్ వయసు 95ఏళ్లు. ఈ వయసులోనూ వారిద్దరూ కరోనాను జయించారు. ఇద్దరూ కేవలం 9 రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. కరోనా వచ్చిందని టెన్షన్ పడకుండా, వెంటిలేటర్ నుంచి లేచి నవ్వుతూ ఇంటికి వచ్చేశారు. కరోనా సోకితే భయపడొద్దని, మనో ధైర్యమే మందు అని ఈ వృద్ధులు చెబుతున్నారు.

లాతూర్ లోని విలాస్ రావ్ దేశ్ ముక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఈ వృద్ధ దంపతులు 9 రోజుల పాటు ఐసీయూలో ఉన్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగొచ్చారు. తొందరగానే కరోనాని గుర్తించడం, సమయానికి చికిత్స అందించడం వల్ల వృద్ధ దంపతులు కరోనాను జయించగలిగారని డాక్టర్లు చెప్పారు.

How Did 105 Year Old Couple Beat Coronavirus

”మా కుటుంబంలో మొత్తం ఐదుగురు కరోనా బారిన పడ్డారు. మాది జాయింట్ ఫ్యామిలీ. నా తల్లిదండ్రులతో పాటు ముగ్గురు పిల్లలు కూడా కరోనా బారిన పడ్డారు. నా తల్లిదండ్రులకు టెంపరేచర్ బాగి పెరిగిపోయింది. మా నాన్నకు బాగా కడుపునొప్పి కూడా వచ్చింది. దీంతో నా తల్లిదండ్రులను ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని నిర్ణయించుకున్నా” అని చవాన్ కొడుకు సురేష్ చెప్పాడు.

మా ఊరికి 3 గంటల దూరంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బెడ్లు దొరికాయి. నా తల్లిదండ్రులు బాగా భయంలో ఉన్నారు. నాకూ భయంగా ఉంది. అయితే వారిని ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని నాకు తెలుసు. వృద్ధులు కావడంతో డాక్టర్లు వారికి ఆక్సిజన్ అందించారు. అలాగే యాంటీవైరల్ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్స్ ఐదు డోసులు ఇచ్చారు. దీంతో వారు కోలుకుననారు. ముందుగా నా తండ్రిని డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు నా తల్లిని డిశ్చార్జ్ చేశారు” అని సురేష్ తెలిపాడు.

”వారిద్దరని సరైన సమయానికి మా దగ్గరికి తీసుకొచ్చారు. చికిత్స అందించడంలో ఏ మాత్రం ఆలస్యం చెయ్యలేదు. దాని వల్ల అద్భుతమే జరిగింది” అని వృద్ధులకు ట్రీట్ మెంచ్ చేసిన డాక్టర్ హల్కాంచె చెప్పారు. ప్రస్తుతం లాతూర్ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది. రోజూ దాదాపుగా వెయ్యి కొత్త కేసులు బయటపడుతున్నాయి. అయితే చాలా మంది సరైన సమయంలో టెస్టులు చేయించుకోవడం లేదు. బాగా సీరియస్ అయిన తర్వాతే ఆసుపత్రులకు వస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్లు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సరైన సమయానికి వ్యాధిని గుర్తించడం, ట్రీట్ మెంట్ తీసుకోవడం వల్ల కచ్చితంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకోవచ్చు అని డాక్టర్ హల్కాంచె అన్నారు.

105-year-old & his 95-year-old wife win Covid battle

”నేను ప్రతి రోజూ ఆసుపత్రికి వెళ్లే వాడిని. చిన్న కిటికీ అద్దంలోంచి నా తల్లిదండ్రులను చరూసే వాడిని. మేము కోలుకుంటామా? మళ్లీ మన ఊరిని చూస్తామా? అని నా తల్లిదండ్రులు ప్రతి రోజూ అడిగేవారు. రేపు మీరు డిశ్చార్జి అవుతారు అని రోజూ వారికి చెప్పేవాడిని” అని జరిగింది వివరించాడు సురేష్.

తన తండ్రి రైతు అని, చాలా యాక్టివ్ గా ఉండేవాడని, బాగా శారీరక శ్రమ చేసేవాడని సురేష్ చెప్పాడు. కరువు పీడిత ప్రాంతంలో నీటి సంరక్షణ కోసం మా నాన్న చాలా కష్టపడ్డాడు అని తెలిపాడు. ఊరిలో బడి కోసం, బావి నిర్మాణం కోసం నా తండ్రి తన సొంత భూమిని దానం చేశాడని సురేష్ చెప్పాడు. నాడు ఆయన చేసిన మంచి పనులే నేడు ఆయనను కాపాడాయని, కరోనాను జయించేలా చేశాయని… ఊరి వాళ్లు చాలామంది అన్నారని సురేష్ చెప్పాడు.