105 ఏళ్ల భామ్మ ఓటేసింది గురూ..

105 ఏళ్ల భామ్మ ఓటేసింది గురూ..

18 ఏళ్లు వయసుంటే ఓటేసేయొచ్చు. ఓటు వేయడానికి శ్రమపడాలని, సమయం వెచ్చించాలని నిర్లక్ష్యం చేస్తున్న యువత దర్శనమిస్తున్న సభ్య సమాజంలో 105ఏళ్ల భామ్మ స్వయంగా కదిలి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో భాగంగా సిక్కింలో 105 సంవత్సరాల సుమిత్రా రాయ్‌ దక్షిణ సిక్కింలోని పాక్లోక్‌ కమ్రాంగ్‌ పోలింగ్‌ కేంద్రానికి వీల్‌ ఛైర్‌లో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇంత వయస్సులోనూ తాను స్వయంగా వచ్చి ఓటు వేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా ఓటరు గుర్తింపు కార్డుతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈమే కాదు.. 2017లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 126 ఏళ్ల చంద్రవదియ అజిబెన్‌ సిదభాయ్‌ అనే మహిళ అత్యధిక వయసు కలిగిన ఓటరుగా రికార్డు సృష్టించారు.