మునిగిపోయింది : పూణెలో కుండపోత వానకు 13 మంది మృతి

  • Published By: madhu ,Published On : September 26, 2019 / 07:32 AM IST
మునిగిపోయింది : పూణెలో కుండపోత వానకు 13 మంది మృతి

దేశ వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. పూణెలో కురిసిన కుండపోవత వానకు ఆ సిటీ మునిగిపోయింది. ఇల్లు కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. పూణెలో భారీ వర్షాలకు ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. శివపూర్‌లో వరదల ప్రవాహానానికి ఐదుగురు కొట్టుకపోయారు.

షాక్రానగర్‌లో ఓ భవంతి కూలిపోవడంతో 9 సంవత్సరాల బాలుడితో పాటు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ ఘటన సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం జరిగింది. మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి పూణె, ఇతర జిల్లాల్లో 100 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా వర్షాలు పడుతాయని హెచ్చరించింది.

అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని IMD సూచించింది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. పురందర్, బారామతి, భోర్, హవేలిలో గురువారం సెలవు ప్రకటించారు. 150 ఇళ్లు దెబ్బతిన్నట్లు సమాచారం. NDRF, SDRF, FIRE, ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తీర ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. 

ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ఒకేసారి రావడంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఉధృతమే అనేకచోట్ల ఒకేసారి కుండపోత వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.