Mangaluru : కుటుంబంపై కరోనా పంజా..11 మంది సేఫ్

కుటుంబంపై కరోనా పంజా విసిరింది. వారు మాత్రం ఏం భయపడలేదు. ఇంట్లోనే ఉండి 11 మంది కుటుంబసభ్యులు కోలుకున్నారు.

Mangaluru : కుటుంబంపై కరోనా పంజా..11 మంది సేఫ్

Family

Family Beat Covid 19  : కరోనా కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. అమ్మ, నాన్న కోల్పోయి ఒకరు, సర్వస్వం కోల్పోయిన వారు మరొకరు..ఇలా ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కానీ..కరోనాకు ధైర్యమే మందు..అని పలువురు సూచిస్తున్నారు. ఇలాగే ఓ కుటుంబంపై కరోనా పంజా విసిరింది. వారు మాత్రం ఏం భయపడలేదు. ఇంట్లోనే ఉండి 11 మంది కుటుంబసభ్యులు కోలుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చేస్తోంది.

మంగళూరు ప్రాంతంలో చెందిన రాజగోపాల్ 58, పూర్ణిమ దంపతులు నివాసం ఉంటున్నారు. 25, 27 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులున్నారు. వైరస్ లక్షణాలు కనిపించడంతో రాజగోపాల్ కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. రాజగోపాల్ కు కరోనా సోకినట్లు తేలింది. హోం ఐసోలేషన్ లో చికిత్స పొందారు.

అంతలోపే..ఫ్యామిలో ఉన్న వారందరికీ వైరస్ లక్షణాలు కనిపించాయి. అప్పటికే..వీరింటికి ముంబై నుంచి కొందరు బంధువులు వచ్చారు. వీరిలో ముసలివారితో పాటు నడి వయసు వారు, ఒక పాప కూడా ఉన్నారు. మొత్తంగా..11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఇంట్లోనే ఉండి..మంచి ఆహారం తీసుకుంటూ..జాగ్రత్తలు పాటిస్తే..సరిపోతుందని వైద్యులు సూచించారు.

ఇంట్లోనే..భౌతిక దూరం పాటిస్తూ.. హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు. అందరూ పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన మందులను వాడుతూ కరోనా వైరస్‌ను జయించారు. అందరూ కరోనా నుంచి బయటపడ్డారు.

Read More : Mumbai Man: నీకు ఆమెతో ఎఫైర్‌ ఉంది.. 10 లక్షలు ఇవ్వు