లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రైతులపై వ్యవసాయ మంత్రి ఫైర్

Updated On - 4:09 pm, Fri, 22 January 21

11 round talks నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం 11వ విడత చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో చర్చలు జరుగుతన్నాయి. ప్రభుత్వం తరపున ముగ్గురు కేంద్రమంత్రులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే, 11వ దఫా చర్చల్లో భాగంగా.. రైతులపై కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్​ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

సాగు చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని.. 10వ దఫా చర్చల్లో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై ఆలోచించి చెబుతామని చెప్పి రైతులు భేటీని ముగించారు. అయితే ఈ ప్రదిపాదనను రైతులు తిరస్కరించారంటూ గురువారం మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విషయమై ఇవాళ చర్చల సమయంలో రైతు నేతలపై వ్యవసాయశాఖ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరిస్తూ రైతులు పత్రికా ప్రకటన విడుదల చేయడంపై తోమర్ అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తే.. ఆ విషయం సమావేశానికి వచ్చి చెప్పాలి కానీ ముందుగా మీడియాకు చెప్పడమేంటని తోమర్​ రైతు నేతలను ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమేనని తోమర్​ మండిపడినట్టు పేర్కొన్నాయి. మరో వైపు.. ప్రభుత్వం, రైతుల మధ్య జరుగుతున్న చర్చల సంభాషణలు బయటకు ఎలా వెళుతున్నాయని తోమర్​ ప్రశ్నించారు. దీని వెనకున్న ఆంతర్యం ఏంటని అడిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు, తాము ఇప్పటికే మంచి ప్రతిపాదనను రైతులకు అందించామని మీ సమావేశం సందర్భంగా కేంద్రమంత్రులు వ్యాఖ్యానించగా..చట్టాల రద్దే తమకు కావాల్సిందని మరోమారు రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.