Terrorists killed In J&K : కశ్మీర్ వ్యాలీకి భారీగా అదనపు భద్రతా బలగాలు..112మంది ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్న సమయంలో 5,500కి పైగా అదనపు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs) సిబ్బందిని వ్యాలీకి పంపినట్లు మంగళవారం

Terrorists killed In J&K : కశ్మీర్ వ్యాలీకి భారీగా అదనపు భద్రతా బలగాలు..112మంది ఉగ్రవాదులు హతం

Kashmir (1)

Terrorists killed In Jammu Kashmir జమ్మూకశ్మీర్ లో పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్న సమయంలో 5,500కి పైగా అదనపు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs) సిబ్బందిని వ్యాలీకి పంపినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

బలగాల భద్రత మరియు విజిబులిటీని పెంచే వ్యూహంలో భాగంగా వీరిని కశ్మీర్ వ్యాలీకి తరలించినట్లు తెలిపారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 55 కంపెనీల కేంద్ర బలగాలను లోయలో మోహరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత నెలలో ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

కాగా, అక్టోబర్ 1 నుంచి జమ్మూ కశ్మీర్‌లో పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కనీసం 14 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో బీహార్‌,యూపీకి చెందిన కూలీలు,స్థానిక ఉపాధ్యాయులతో సహా కశ్మీర్‌లోని మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు.

ఇక,ఈ ఏడాది ఇప్పటివరకు జమ్మూకశ్మీర్ లో సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లలో మొత్తం 112 మంది ఉగ్రవాదులు మరణించారని మరియు 135 మందిని పట్టుకున్నారని అధికారులు తెలిపారు.

ALSO READ Mansukh Mandaviya : భారత కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ కు 96 దేశాలు ఆమోదం