Coronavirus Vaccine : గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం, జూన్ లో 12 కోట్ల డోసులు

సెకండ్ వేవ్ కరోనా భారత్‌లో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కానీ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్‌ డోసు కోసం రోజులు, నెలల తరబడి ఎదురుచూస్తున్నవారు లక్షల మంది ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చిందని తెలిస్తే చాలు... వ్యాక్సినేషన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లి ఎగబడుతున్నారు.

Coronavirus Vaccine : గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం, జూన్ లో 12 కోట్ల డోసులు

India June Covid Vaccine

12 Crore Doses Of Covid Vaccine : సెకండ్ వేవ్ కరోనా భారత్‌లో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కానీ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్‌ డోసు కోసం రోజులు, నెలల తరబడి ఎదురుచూస్తున్నవారు లక్షల మంది ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చిందని తెలిస్తే చాలు… వ్యాక్సినేషన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లి ఎగబడుతున్నారు. అయితే ఈ కష్టాలు మరికొన్ని రోజులేనంటోంది కేంద్రం. జూన్ నెలలో ఏకంగా 12 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. దేశవ్యాప్తంగా మేలో 7 కోట్ల 90 లక్షల డోసులను అందుబాటులో ఉంచితే వచ్చే నెల ఏకంగా 4 కోట్ల డోసులు పెరగనున్నాయని స్పష్టం చేసింది.

45 ఏళ్లకు పైబడ్డవారితో పాటు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ అందించడంలో భాగంగా వచ్చే నెలలో 6 కోట్ల 9 లక్షల డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తామంది కేంద్రం. 5 కోట్ల 86 లక్షల డోసులను రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు సేకరించుకునేందుకు అందుబాటులో ఉంచుతామంది. ఈ వ్యాక్సిన్లను ఎప్పుడు సరఫరా చేసేది ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందుగానే తెలియజేస్తామంది కేంద్ర ఆరోగ్యశాఖ. దీంతో వ్యాక్సిన్‌ సేకరణ, పంపిణీకి సంబంధించి పకడ్భంధీ ప్రణాళికలు రూపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది.

రాష్ట్రాల్లోని జనాభా, ఇప్పటివరకు జరిగిన వ్యాక్సిన్ పంపిణీ, వృథా… వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుని మరీ సరఫరా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో వ్యాక్సిన్‌ వేస్టేజీని అరికట్టవచ్చని భావిస్తోంది. జూన్‌లో 12 కోట్ల డోసులు ఇస్తామని ప్రకటించడం వెనుక సీరమ్ సంస్థ ఇచ్చిన హామీనే ప్రధాన కారణం. మేలో 6 కోట్ల 50 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు ఉత్పత్తి జరిగితే…జూన్‌లో ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్లాన్ చేసింది సీరమ్ సంస్థ. జూన్‌లో పది కోట్ల కోవిషీల్డ్ డోసులు ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సీరమ్ సంస్థ లేఖ కూడా రాసింది. టీకా ఉత్పత్తిని పెంచేందుకు తమ సంస్థ ఉద్యోగులు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారని ఆ లేఖలో పేర్కొంది.

సీరమ్ సంస్థ…జూన్‌లో 6 కోట్ల 50 లక్షలు, జులైలో 7 కోట్లు, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో 10 కోట్ల చొప్పున వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అయితే జూన్‌లోనే ఉత్పత్తిని గణనీయంగా పెంచుతామని తాజాగా స్పష్టం చేసింది. దీనికి తోడు స్పుత్నిక్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు భారత్ బయోటెక్ కూడా కోవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచుతోంది. ప్రస్తుతం నెలకు కోటీ 30 లక్షల కోవాగ్జిన్‌ డోసులు ఉత్పత్తి జరుగుతోంది. అక్టోబర్‌ నుంచి నెలకు 10 కోట్ల డోసుల ఉత్పత్తికి ప్లాన్ చేస్తోంది. దీంతో కేంద్రం.. వ్యాక్సిన్‌ సప్లై విషయంలో గట్టి హామీ ఇస్తోంది. ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో అందరికీ సరిపడా వ్యాక్సిన్‌ డోసులు అందివ్వగలమని చెబుతోంది.

Read More : Mother In Law Corona : అమానవీయం.. కోడలికి కరోనా అంటించి ఇంటి నుంచి గెంటేసిన అత్త