మహిళలకు 12రోజుల పీరియడ్స్ లీవ్

మహిళలకు 12రోజుల పీరియడ్స్ లీవ్

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పీరియడ్స్ లో ఉన్న మహిళలకు 10 రోజుల లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. సూరత్ లోని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కూడా అటువంటి ఆఫర్ నే ప్రకటించింది. IVIPANAN కంపెనీ వ్యవస్థాపకుడు భౌతిక్ శేత్ ఆదివారం మహిళా స్టాఫ్ పీరియడ్స్ లో ఉన్న వారు వెంటనే అడిగి తీసుకోవాలని వారికి 12 రోజుల లీవ్ తీసుకునే వెసలు బాటు ఉందని తెలిపారు.

ఈ కంపెనీ 2014లో స్థాపించగా అందులో ఉన్న వారు ఎనిమిది మంది మహిళలే. ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. నెలసరి వచ్చి ఇబ్బందిపడడం కంటే మా మహిళా టీం సభ్యులకు ఈ ఆదివారం నుంచి పీరియడ్స్ మీద లీవ్ తీసుకున్న వారందరికీ పెయిడ్ లీవ్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

మా టీంకు మరింత కంఫర్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. హ్యూమన్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలనేదే మా ఆలోచన. ఇంకా ఎలా పెంపొందించగలమో ప్లాన్ చేస్తున్నాం. అని భౌతిక్ శేత్ తెలిపారు.

పీరియడ్స్ సమయంలో మహిళా స్టాఫ్ కాస్త డిస్ కంఫర్ట్ ఫీల్ అవుతున్నట్లు అనిపించింది. పని ఒత్తిడి, ఆఫీసు వాతావరణం వారి బాధ, ఇబ్బందిని పెంచుతున్నట్లుగా అనిపించొచ్చు. ఇప్పుడు ఎవరైనా స్టాఫ్ సమస్యగా అనిపిస్తే 12 రోజుల లీవ్ తీసుకోవచ్చు. ఒక రోజు మాత్రం పెయిడ్ లీవ్ కల్పిస్తారు.

ఈ రోజుల్లో ఆఫీసుల్లో పనిపపచేస్తున్నారు. ఇలాంటి అవసరం ఉన్నప్పుడు వారు బ్యాగ్, పర్స్, ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకుని వాష్ రూంకు వెళ్లాలి. ఇటువంటి సమస్య నుంచి మేం వారిని బయటపడేయాలనుకుంటున్నాం. ఇండియాలో ఉన్న అన్ని చిన్న తరహా బిజినెస్ లకు ఓ మెసేజ్ ఇస్తున్నాం. మగ, ఆడల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాం అని ఆయన తెలిపారు.