Fishermen Released : శ్రీలంక జైలు నుంచి 12 మంది జాలర్లు విడుదల

తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టినట్లు ఆరోపిస్తూ నిర్బంధించిన 12 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక కోర్టు విడుదల చేసింది.

Fishermen Released : శ్రీలంక జైలు నుంచి 12 మంది జాలర్లు విడుదల

Fishermen Released

Fishermen Released : తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టినట్లు ఆరోపిస్తూ నిర్బంధించిన 12 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక కోర్టు విడుదల చేసింది. వీరిని తమిళనాడుకు త్వరగా తరలించేందుకు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 19న శ్రీలంక నావికాదళం 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసింది. వెంటనే చర్యలు చేపట్టిన భారత ప్రభుత్వం అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారు. అనంతరం అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. ఇక ఈ కేసు గురువారం మన్నార్ కోర్టు ముందుకు వచ్చింది.

చదవండి : Fishermen : సముద్రంలో చిక్కుకున్న 11 మంది మత్స్యకారులు

దీనిపై విచారణ చేపట్టిన CG జాఫ్నా నేతృత్వంలోని ధర్మాసనం.. 12 మంది జాలర్లను విడుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై భారత హై కమిషన్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే, భారతీయ మత్స్యకారులను కలుసుకుని స్వీట్లు అందించారు జాఫ్నా. జాలర్లను విడిపించడంలో త్వరగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాగా గత నెలలో, శ్రీలంక అధికారులు తమిళనాడుకు చెందిన 68 మంది మత్స్యకారులను అరెస్ట్ చేశారు. దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. వారి విడుదల కోసం శ్రీలంక ప్రభుత్వంతో మంతనాలు జరిపింది.

చదవండి : Indian fishermen arest : 54 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక

భారత్, శ్రీలంక ప్రాదేశిక జలాల మధ్య వేట చిరాకుగా మారింది. నిత్యం జాలర్ల మధ్య గొడవలు, అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. శ్రీలంక అధికారులు భారత జాలర్ల బోట్లను అదుపులోకి తీసుకోవడం, కాల్పులు జరపడం పరిపాటిగా మారింది. పాక్ జలసంధిలో భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ సిబ్బంది కాల్పులు జరిపి, వారి పడవలను స్వాధీనం చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. పాక్ జలసంధి వేటకు అనువైన ప్రాంతం. ఇక్కడ భారత్, శ్రీలంక జాలర్లు నిత్యం వేటకు వస్తుంటారు. ఇక్కడే సరిహద్దు జలాల వివాదం జరుగుతోంది.