లక్నో కంటోన్మెంట్ మసీదులో దాక్కున్న 12మంది జమాత్ సభ్యులు

ఉత్తరప్రదేశ్‌లోని తబ్లిగీ జమాత్ సభ్యులు కలకలం రేపారు. లక్నో కంటోన్మెంట్ ఏరియాలో తబ్లిగీ జమాత్ సభ్యులు 12మంది ఓ మసీదులో దాక్కున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 5, 2020 / 05:22 PM IST
లక్నో కంటోన్మెంట్ మసీదులో దాక్కున్న 12మంది జమాత్ సభ్యులు

ఉత్తరప్రదేశ్‌లోని తబ్లిగీ జమాత్ సభ్యులు కలకలం రేపారు. లక్నో కంటోన్మెంట్ ఏరియాలో తబ్లిగీ జమాత్ సభ్యులు 12మంది ఓ మసీదులో దాక్కున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని తబ్లిగీ జమాత్ సభ్యులు కలకలం రేపారు. లక్నో కంటోన్మెంట్ ఏరియాలో తబ్లిగీ జమాత్ సభ్యులు 12మంది ఓ మసీదులో దాక్కున్నారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సమాచారంతో అలర్ట్‌ అయిన యూపీ పోలీసులు.. అత్యంత చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో 12మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆస్పత్రికి తరలించారు. జమాత్‌కు వెళ్లి వచ్చి అధికారులకు సమాచారం ఇవ్వనందుకు 12మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలోకి ప్రవేశించిన ఈ మహమ్మారి..అందరినీ గడగడలాడిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది ఈ రాకాసి. కానీ..కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ తీవ్ర ప్రకంపనలు రేపింది. తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరైన వారిలో చాలా మందికి ఈ వైరస్ సోకడం ఆందోళన కలిగించింది.

ఈ సమావేశాల్లో పాల్గొ్న్న వీరంతా..వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. వీరి మూలంగా పాజిటివ్ కేసులు అధికమౌతూ వస్తున్నాయి. అప్పటి వరకు తక్కువగా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా ఎక్కువ కావడంతో ప్రభుత్వ యంత్రాంగాలు అలర్ట్ అయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన వారిలో సుమారు 9 వేల మందిని క్వారంటైన్ లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఈ సమావేశాల్లో ఎవరు పాల్గొన్నారనే దానిపై దృష్టి సారించామని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ చెప్పారు.

ఈ సమావేశాలకు హాజరైన 9 వేల మందిని, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలించామన్నారు. ఇందులో వేయి 306 మంది విదేశీయులు, తెలంగాణలో 96 మంది, ఏపీలో 24 మంది విదేశీయులున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.