Winter Session : తొలిరోజే..శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు 12మంది విపక్ష ఎంపీలు సస్పెండ్

పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే 12 మంది విపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వర్షాకాల సమావేశాల చివరి రోజున రాజ్యసభలో వీరు గందరగోళం సృష్టించారన్న కారణంతో శీతాకాల సమావ

Winter Session : తొలిరోజే..శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు 12మంది విపక్ష ఎంపీలు సస్పెండ్

Pa

Winter Session :  పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే 12 మంది విపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వర్షాకాల సమావేశాల చివరి రోజున రాజ్యసభలో వీరు గందరగోళం సృష్టించారన్న కారణంతో శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వీరిని సస్పెండ్ చేస్తూ రాజ్యసభ నిర్ణయం తీసుకుంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరిరోజున 12 మంది ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు..అంతేకాకుండా నల్లజెండాలు చేతపట్టుకుని టేబుల్స్ ఎక్కి ఫైళ్లు, పత్రాలు చెల్లాచెదురు చేయడం సీసీటీవీ విజువల్స్ లో కనిపించింది. వర్షాకాల సమావేశాల చివరి రోజున వీరంతా తీవ్రంగా ప్రవర్తించారని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. సీపీఎం ఎంపీ ఎలమారం కరీం ఓ పురుష మార్షల్‌పై దాడి చేశారని, ఛాయా వర్మ, ఫులో దేవి ఓ మహిళా మార్షల్‌పై దాడి చేశారని తెలిపింది. ఈ నివేదికను రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడుకు సమర్పించింది.

ఈ నేపథ్యంలో 12 మంది ఎంపీలు-బినయ్ విశ్వం(సీపీఐ), టీఎంసీ ఎంపీ శాంత ఛేత్రి(టీఎంసీ), శివసేన ఎంపీ అనిల్ దేశాయ్‌(శివసేన) ప్రియాంక చతుర్వేది (శివసేన), డోలా సేన్ (టీఎంసీ), ఎలమారం కరీం (సీపీఎం), కాంగ్రెస్ ఎంపీలు ఫులో దేవి నేతం, ఛాయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరికి జారీ చేసిన సస్పెన్షనల్ నోటీసులో వీరు 2021 ఆగస్టు 11న సభ చైర్మన్ అధికారం పట్ల పూర్తిగా అగౌరవాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. పంతంపట్టి సభ కార్యకలాపాలను అడ్డుకున్నారని పేర్కొన్నారు.

ఇక,ఈ సస్పెన్షన్‌ను విపక్ష పార్టీలు ఖండించాయి. ఈ చర్య “అసమర్థం మరియు అప్రజాస్వామికం” అని ప్రతిపక్షం ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది.అ యితే ఈ లేఖపై తృణమూల్ కాంగ్రెస్ సంతకం చేయలేదు.

ALSO READ Aziz Qureshi : బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగ మార్పు ఖాయం..ఓవైసీ-బీజేపీ కలిసి..