నోటి గాయంతో మరో ఏనుగు పిల్ల మృతి..అనుమానిస్తున్న అధికారులు

  • Published By: nagamani ,Published On : June 22, 2020 / 10:27 AM IST
నోటి గాయంతో మరో ఏనుగు పిల్ల మృతి..అనుమానిస్తున్న అధికారులు

ఇటీవల కాలంలో వరుసగా ఏనుగులు చనిపోతుండటం తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పేలుడుపదార్ధాలు పెట్టి హత్య చేసిన ఘటన నాటినుంచి పలు ప్రాంతాల్లో గజరాజుల మరణవార్తలు వస్తునే ఉన్నాయి. 

ఈక్రమంలో తమిళనాడు  కోయంబత్తూర్ శివార్లలోని జంబుకాండి గ్రామంలో ఓ పిల్ల ఏనుగు అనుమానాస్పదంగా చనిపోయింది. కోయంబత్తూరు శివారులోని జంబుకంది గ్రామంలో 12 ఏండ్ల వయసున్న మగ ఏనుగు మరణించింది. దీన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

 
దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు ఏనుగు పిల్లను పరిశీలించారు. ఈ ఏనుగు పిల్ల గత కొన్ని రోజులుగా నోటి గాయంతో బాధపడుతున్నదని..దానిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. ఏనుగు పిల్లకు నోటి గాయం కావటం..అది మరణించటపైంపై అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఇటీవల కేరళలో అనాస పండులో బాంబు పెట్టి ఒక ఏనుగుకు తినిపించిన సంగతి తెలిసిందే. ఆ పండును తినడంతో బాంబు పేలి ఆ ఏనుగు నోటికి తీవ్ర గాయమైంది. ఆ బాధ నుంచి ఉపశమనానికి ఓ చెరువులో దిగి చివరకు మరణించింది. అయితే ఆ ఏనుగు గర్భందాల్చిందని, కడుపులోని పిల్ల కూడా చనిపోయినట్లు అనంతరం నిర్ధారణ అయ్యింది. మూగజీవిని దారుణంగా హతమార్చిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఇటీవల వరుసగా మూడు రోజుల పాటు మూడు ఏనుగులు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాయి. తీవ్రంగా స్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ అటవీశాఖ అధికారితోపాటు ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. 

Read: భారత్ లో కరోనా వల్ల మహిళలే ఎక్కువగా చనిపోతున్నారా