Madhya Pradesh: శివరాత్రి వేడుకలో కుల కులాల మధ్య గొడవలు.. 14 మంది తీవ్ర గాయాలు

ఇక గుజ్జర్ కమ్యూనిటీ నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ప్రేమ్‌లాల్‌తో పాటు మరో 33 మందిపై ఆయుధాలతో దాడి జరిగిందంటూ రవీంద్రరావు మరాఠా కౌంటర్‌ కేసు నమోదు చేశారు. "పోలీసులు, రెవెన్యూ అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. ఆలయంలోకి ప్రవేశించకుండా ఏ కులాన్ని అడ్డుకోకూడదని ఇరువర్గాలకు నచ్చజెప్పాం" అని స్థానిక పోలీసు అధికారి దీక్షిత్ చెప్పారు

Madhya Pradesh: శివరాత్రి వేడుకలో కుల కులాల మధ్య గొడవలు.. 14 మంది తీవ్ర గాయాలు

14 Injured As Shivratri Sees Clashes Over Caste In Madhya Pradesh

Madhya Pradesh: శివరాత్రివేళ రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు చెలరేగాయి. దళితుల్ని గుడిలోకి రానివ్వకుండా గుజ్జర్ కులస్తులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య పెరిగిన మాటా మాటా ఘర్షణకు దారి తీసింది. చేతికి దొరికిన కర్రలు, రాళ్లు, ఇతర వస్తువులతో ఒకరినొకరు కొట్టుకోవడంతో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖార్గోన్ జిల్లా, సనావాడ్ ప్రాంతంలోని ఛప్రా అనే గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం చోటు చేసుకున్న బాధాకర సంఘటన ఇది. ఆధిపత్య కులాలు తమను గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని దళిత సంఘాల సభ్యులు ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో జరిగిన హింసలో ఇరువైపుల నుంచి విచక్షణారహితంగా రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. అనంతరం ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Gujarat: మాజీ సర్పండ్ మేనల్లుడి వివాహం.. గాల్లోకి రూ.లక్షల నోట్ల కట్టలు విసురుతూ సంబరాలు

విషయంలోకి వెళ్తే.. దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక బాలిక, మహాశివరాత్రి సందర్భంగా గుడిలోకి వెళ్తుండగా ఆమెను భయ్యా లాల్ పటేల్ నేతృత్వంలోని గుర్జార్ వర్గానికి చెందిన వారు అడ్డుకున్నారు. ఆమెకు మద్దతుగా కొంతమంది దళిత సంఘాల సభ్యులు వచ్చి ఆలయప్రవేశం చేయించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాన్ని గుజ్జర్ కమ్యూనిటీవారు తీవ్రంగా ప్రతిఘటించారు. అంతే ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. అనంతరం గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన 17 మందిపై షెడ్యూల్డ్ కులాలు-షెడ్యూల్డ్ తెగల రక్షణ చట్టం (ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం) కింద కేసు నమోదు చేశారు. మరో 25 మంది గుర్తుతెలియని ఇతరులపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ShivSena: షిండే భారీ స్కాం, శివసేన కోసం ₹ 2,000 కోట్ల డీల్.. ఉద్ధవ్ వర్గం తీవ్ర ఆరోపణలు

ఇక గుజ్జర్ కమ్యూనిటీ నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ప్రేమ్‌లాల్‌తో పాటు మరో 33 మందిపై ఆయుధాలతో దాడి జరిగిందంటూ రవీంద్రరావు మరాఠా కౌంటర్‌ కేసు నమోదు చేశారు. “పోలీసులు, రెవెన్యూ అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. ఆలయంలోకి ప్రవేశించకుండా ఏ కులాన్ని అడ్డుకోకూడదని ఇరువర్గాలకు నచ్చజెప్పాం” అని స్థానిక పోలీసు అధికారి దీక్షిత్ చెప్పారు. అయితే దీనికి ముందు గొడవలు గ్రామంలో వేరే ఉన్నాయట. గ్రామంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మర్రిచెట్టును నరికేశారు. అయితే అది తమకు పవిత్రమైన చెట్టని ఆధిపత్య వర్గాలు దళితులపై ఆగ్రహంతో ఉన్నాయట. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నట్లు సమాచారం.