Rajasthan: 80 లక్షల కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు

ఒక్కో సిలిండర్​పై రూ.640 సబ్సిడీ అందిస్తోంది రాజస్థాన్ ప్రభుత్వం.

Rajasthan: 80 లక్షల కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు

LPG Cylinder Price

Rajasthan – LPG subsidy: రాజస్థాన్ లో రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు అందుతున్నాయి. రాజస్థాన్ లో 80 లక్షల కుటుంబాలకు ఇందిరా గాంధీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం కింద ఈ ధరకు ఎల్పీజీ సిలిండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోంది. అందులో భాగంగా ఇవాళ 14 లక్షల కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నారు.

ఒక్కో సిలిండర్​పై రూ.640 సబ్సిడీ అందిస్తోంది రాజస్థాన్ ప్రభుత్వం. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు తాజాగా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు సీఎం అశోక్ గెహ్లాట్. రాష్ట్ర స్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం అర్హులను గుర్తించి సబ్సిడీ సిలిండర్లు అందిస్తున్నామని రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది.

రాజస్థాన్ లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన గెలుపుతో రాజస్థాన్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటోంది. కర్ణాటకలో ఇచ్చిన హామీల వంటివే మిగతా రాష్ట్రాల్లో ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

KTR: ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్.. అప్పట్లో అనేకమంది ఆశ్చర్యంగా చూశారని కామెంట్స్