Supreme Court : సుప్రీం కోర్టులో 150 మంది సిబ్బందికి కరోనా

ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22వేల పైచిలుకు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాల్లోని సిబ్బంది కరోనా బారినపడుతున్నారు.

Supreme Court : సుప్రీం కోర్టులో 150 మంది సిబ్బందికి కరోనా

Supreme Court

Supreme Court : ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22వేల పైచిలుకు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాల్లోని సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. తాజాగా పార్లమెంట్ లో పనిచేసే 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇక ఇదిలా ఉంటే.. సుప్రీం కోర్టులో పనిచేసే 150 మంది సిబ్బంది కరోనా బారినపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు జడ్జీలు ఉన్నట్లు సమాచారం. సుప్రీం కోర్టులో మొత్తం 3,000 మంది సిబ్బంది ఉండగా.. 5 శాతం మంది కరోనా బారినపడ్డారు. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో కోర్టు ప్రాంగణంలో అధికారులు కరోనా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు.

చదవండి : Supreme Court : అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణపై సుప్రీంకోర్టులో విచారణ, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

ఇక ఇదిలా ఉంటే శనివారం ముంబైలో 68 మంది సీబీఐ సిబ్బంది కరోనా బారినపడ్డారు. ముంబై లోని సీబీఐ కార్యాలయంలో మొత్తం 230 మంది సిబ్బంది ఉండగా వీరిలో 68 మందికి కరోనా సోకినట్లుగా అధికారులు తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా.. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించింది. ఇక తాజాగా ప్రభుత్వం కార్యాలయాల్లో 50 శాతం అక్యుపెన్సీతో సేవలు కొనసాగించాలని తెలిపింది ప్రభుత్వం. అధికారులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

చదవండి : Supreme Court : నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్