Bharat Jodo Yatra: రాహుల్ యాత్రలో ఉండగానే 1,500 కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారట!

కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన కూటమి తప్పులు చేస్తోంది. ఇప్పటికి రోజురోజుకు ఎన్నో తప్పులు చేస్తున్నాయి. ఆ తప్పుల నుంచి తమను కాపాడుకోవడానకే ఆ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు, 1,500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపిలో చేరారు. అందుకే ఆ మూడు పార్టీలు (కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేన) ముందు తమ సొంతింటిని కాపాడువాలి. తర్వాత దేశవ్యాప్త యాత్రలు చేయాలి

Bharat Jodo Yatra: రాహుల్ యాత్రలో ఉండగానే 1,500 కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారట!

1,500 Cong workers joined BJP when Rahul was in Maharashtra: BJP leader

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ఈ యాత్రతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్టే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నేత చంద్రశేఖర్ బవాన్‭కులే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో యాత్ర చేస్తున్న సమయంలోనే ఆ రాష్ట్రానికి చెందిన 1,500 కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Nirmala Sitharaman: నేను మధ్యతరగతే, వారి కష్టాలు తెలుసు.. బడ్జెట్‭పై ఆర్థిక మంత్రి నిర్మలా

‘‘కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన కూటమి తప్పులు చేస్తోంది. ఇప్పటికి రోజురోజుకు ఎన్నో తప్పులు చేస్తున్నాయి. ఆ తప్పుల నుంచి తమను కాపాడుకోవడానకే ఆ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు, 1,500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపిలో చేరారు. అందుకే ఆ మూడు పార్టీలు (కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేన) ముందు తమ సొంతింటిని కాపాడువాలి. తర్వాత దేశవ్యాప్త యాత్రలు చేయాలి” అని చంద్రశేఖర్ బవాన్‌కులే అన్నారు.

PM Candidate Remark: ప్రధాని పదవి ఖాళీగా లేదు.. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రిప్లై