స్నేహితుడిని సూట్‌కేస్‌లో పెట్టి ప్లాట్‌కు తీసుకొచ్చిన 17ఏళ్ల బాలుడు.. అపార్ట్ మెంట్ వాసుల్లో కరోనా కలవరం!

  • Published By: sreehari ,Published On : April 13, 2020 / 01:41 AM IST
స్నేహితుడిని సూట్‌కేస్‌లో పెట్టి ప్లాట్‌కు తీసుకొచ్చిన 17ఏళ్ల బాలుడు.. అపార్ట్ మెంట్ వాసుల్లో కరోనా కలవరం!

దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రతిఒక్కరూ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అనేక పరిసరాలు, సమాజాలు తమ ప్రాంతాల్లోకి కొత్త వ్యక్తులను రానివ్వడం లేదు. బయటి నుండి ఎవరైనా రాకుండా ఉండటానికి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మూసివేస్తున్నారు. కొత్త వ్యక్తి కనిపిస్తే భయపడిపోతున్నారు. ఎక్కడ తమకు కరోనా వ్యాప్తి చేస్తాడోనన్న భయమే వారిలో కనిపిస్తోంది.

ఇప్పటివరకూ తమ ప్రాంతంలో కనిపించని వ్యక్తులు హఠాత్తుగా కనిపిస్తే.. వారిని అనుమానిస్తున్నారు. సొంతూరికి సైతం వెళ్లినా అక్కడి స్థానిక ప్రజలు వారిని కొత్తవారిలో చూస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలిసి భయపడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ 17ఏళ్ల యువకుడు తన స్నేహితుడిని చూడాలని ముచ్చటపడ్డాడు. అతన్ని సూట్ కేస్ లోపల  దాచిపెట్టి అతన్ని తన ఇంట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు.

ఓ నివేదిక ప్రకారం.. ఈ సంఘటన మంగళూరులో తెల్లవారుజామున 2:00 గంటలకు జరిగింది. 17ఏళ్ల బాలుడు భారీ సూట్‌కేస్‌తో స్కూటర్‌పై తన భవనం నుంచి బయటకు వచ్చాడు. అతను తన స్నేహితుడిని తీసుకొచ్చాడు. అపార్టమెంట్లోకి ప్రవేశించే ముందు.. యువకుడు తన స్నేహితుడిని సూట్‌కేస్ లోపల దాచాడు. ఆ తర్వాత నెమ్మదిగా భవనం లోపలకి తీసుకెళ్లాడు. అతను తన స్కూటర్‌ను భవనం వెలుపల ఉంచడాన్ని సెక్యూరిటీ గార్డు గమనించాడు. అతడి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందని గుర్తించాడు. మరుసటి రోజు ఉదయం భవన సంఘాన్ని సెక్యూరిటీ గార్డు అప్రమత్తం చేశాడు. 

ఉదయం 8:30 గంటలకు టీనేజర్, అతని స్నేహితుడు బయట అడుగు పెట్టారని, ఆ సమయంలోనే సెక్యూరిటీ గార్డు బిల్డింగ్ అసోసియేషన్‌ను పిలిచాడని నివేదిక పేర్కొంది. ఇతర నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు లాగారు. బాలుడి కుటుంబం రెండు వేర్వేరు అపార్టుమెంటులలో నివసిస్తోంది. అతను ఒక అపార్ట్ మెంటులో నివసిస్తున్నాడని, అతని ఇతర కుటుంబ సభ్యులు మరో అపార్ట్ మెంట్లో ఉంటారని అక్కడి స్థానికులు ఒకరు తెలిపారు. 

భవనంలోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించింది భవన సంఘం. యువకుడు తన స్నేహితుడిని తీసుకొచ్చేందుకు అనుమతించమని భవన సంఘాన్ని పదేపదే అభ్యర్థించాడు.. కాని ఫలించలేదు. ఇక లాభం లేదనుకున్నాడు.. ఆ యువకుడు తనతో పాటు తన స్నేహితుడి తీసుకొచ్చేందుకు ప్లాన్ వేశాడు. సూట్ కేసులో దాచిపెట్టి ఇలా ఇంటికి తీసుకొచ్చాడు. దీని కారణంగా ఇప్పుడు అబ్బాయిలిద్దరి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు రావలసి వచ్చింది.(లాక్‌డౌన్ ‌కోరికలు? డ్రోన్‌తో పాన్ మసాలా డెలివరీ.. గుజరాత్ వ్యక్తులు అరెస్ట్)

ప్రస్తుతం.. నివాస ప్రాంతాలు తమ సమాజంలో ఎవరూ ప్రభావితం కాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రతిఒక్కరిలో భయాందోళనలతో కూడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అనవసరంగా భయాలను సృష్టించడం కంటే కొంతకాలం వరకు లాక్ డౌన్ నియమాలకు కట్టుబడి ఉండటం మంచిదని అంటున్నారు.