షాకింగ్ : జన్‌ధన్ ఖాతాల్లో రూ.10వేలు

యూపీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. మొరాబాద్ జిల్లాలో 1700 జన్‌ధన్ ఖాతాల్లో కొదిరోజుల్లోనే పెద్ద మొత్తంలో నగదు జయమ అయ్యింది. ఒక్కో

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 03:18 PM IST
షాకింగ్ : జన్‌ధన్ ఖాతాల్లో రూ.10వేలు

యూపీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. మొరాబాద్ జిల్లాలో 1700 జన్‌ధన్ ఖాతాల్లో కొదిరోజుల్లోనే పెద్ద మొత్తంలో నగదు జయమ అయ్యింది. ఒక్కో

యూపీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. మొరాదాబాద్ జిల్లాలో జన్‌ధన్ ఖాతాల్లో రూ.10వేలు పడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు.. 1700 జన్‌ధన్ ఖాతాల్లో కొది రోజుల్లోనే పెద్ద మొత్తంలో నగదు జమ అయ్యింది. 1700 ఖాతాలకు గాను.. రూ.1.7 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఈ వ్యవహారం సంచలనం రేపింది. అలర్ట్ అయిన ఎన్నికల సంఘం దీనిపై ఫోకస్ పెట్టింది. అసలేం జరగుతోంది అనేది తెలుసుకునే పనిలో పడింది.    

ఐటీ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ డబ్బు వారి ఖాతాల్లోకి జమ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బును జమ చేసి ఉంటారు అనే డౌట్లూ లేకపోలేదు. దీనిపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ డిపాజిట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల వేళ ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో క్యాష్ , బంగారు ఆభరణాలు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

జన్ ధన్ ఖాతాల్లో నగదు జమ కావడం రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది బీజేపీ పనే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన బీజేపీ నేతలు.. తమకు ఎలాంటి సంబంధం లేదని ఎదురుదాడికి దిగారు.

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనను 2014, ఆగస్టు 28న లాంచ్ చేశారు. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు అందించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. అందరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేలా చూడాలనే లక్ష్యంతో తీసుకొచ్చారు. జీరో బ్యాలెన్స్ తో ఇప్పటివరకు కోట్లాది మంది బ్యాంకు ఖాతాలు ఇచ్చారు.