180 మిలియన్ల పాన్ కార్డులు మాయం కాబోతున్నాయ్!

180 మిలియన్ల పాన్ కార్డులు మాయం కాబోతున్నాయ్!

కనీసం 180 మిలియన్ పాన్ కార్డులు మాయం కానున్నాయి. అవును నిజమే.. ఏవైతే పాన్ కార్డులు ఆధార్ తో లింక్ చేయకుండా ఉన్నాయో అవన్నీ త్వరలోనే రద్దు కాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఆధార్ తో లింక్ చేసి ఉన్న పాన్ కార్డులను మాత్రమే యాక్టివ్ గా ఉంచుతారు. అధిక లావాదేవీలు, ఎక్స్ ట్రా కార్డులు వాడుతున్న వారందరినీ పసిగట్టలనేదే ఈ ప్లాన్. వార్షిక ఆధాయంలో తప్పుడు లెక్కలు చూపించి పన్నులను ఎగరగొట్టేవాళ్లను పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యుచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఇతర లావాదేవీలను దాచి ఉంచాలని పాన్ అనుసంధానాన్ని విస్మరిస్తున్నారు. ‘1.3బిలియన్ జనాభా ఉంటే కేవలం 15 మిలియన్ మంది మాత్రమే ఐటీ లెక్కల్లోకి వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిని రీసెంట్ గా పాయింట్ అవుట్ చేశారు. పన్ను వనరులను అర్జెంట్ గా పెంచాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ చర్య తప్పనిసరి’ అని అధికారులు అంటున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం.. 50.95కోట్ల మంది ఉన్న జనాభాలో పాన్ కార్డ్ హోల్టర్లు కేవలం 6.48కోట్లు మాత్రమే ఉన్నారు. అందులో 15మిలియన్ మంది మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తున్నారు.