19 ఏళ్లలో రూ.17 కోట్లు దానం : భర్త ఆశయం నెరవేస్తున్నసాధారణ గృహిణి

  • Published By: chvmurthy ,Published On : February 19, 2020 / 06:21 AM IST
19 ఏళ్లలో రూ.17 కోట్లు దానం : భర్త ఆశయం నెరవేస్తున్నసాధారణ గృహిణి

ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో అందరూ డబ్బు సంపాదిస్తారు..కానీ  ఆ సంపాదించిన డబ్బుని సద్వినియోగం చేయటం…. సంపాదించిన దానిలోంచి దాన ధర్మాలకు వెచ్చించటం అందరూ చేయలేరు. కొద్ది మందే ఆ పని చేయగలుగుతారు. భర్త ఆశయాన్ని నెరవేర్చటం కోసం….తన కుటుంబంలో వచ్చిన కష్టం తన పగవారికి కూడా రాకూడదనే విశాల హృదయంతో భర్త మరణించిన 19 ఏళ్లలో 17 కోట్ల రూపాయలు దానం చేసింది ఓ ఇల్లాలు. 

తమిళనాడులోని మధురై కు చెందిన సుధ కడప జిల్లాకు చెందిన సాధు జనార్ధన్ అనే చార్డర్డ్ అకౌంటెంట్ ను 1975లో పెళ్లి  చేసుకున్నారు. అప్పటికి జనార్ధన్ వయస్సు 28 సంవత్సరాలు. జనార్ధన్  బెంగుళూరులో పేరున్న చార్టర్డ్ అకౌంటెంట్. జనార్ధన్ అసోసియేట్స్ పేరుతో  ఒక ఆఫీసును కూడా నిర్వహిస్తున్నారు. ఆయన తన కెరీర్ లో మంచి ర్యాంకులు సాధించాడు. వృత్తిలో కూడా మంచి పేరు సంపాదించారు. ప్రాక్టీస్ బాగుంది. కావాల్సినంత ఆదాయం వచ్చేది. జీవితం హ్యాపీగా  గడిచిపోతోంది. వారికి ఒక కుమార్తె పుట్టింది. సంతోషంగా గడిచిపోతున్న వారి కుంటుంబంలో ఏప్రిల్ 16,2001 లో విషాదం చోటు చేసుకుంది. 53 ఏళ్ల వయస్సులోనే జనార్ధన్ గుండెపోటుతో మరణించారు. భర్త పోయిన బాధను దిగమింగి కొన్నాళ్లు కన్నీళ్లతోనే కాలం గడిపింది సుధ.  

భర్త  దూరం అయిన బాధతో పాటు మరో బాధ సుధను మానసికంగా కుంగదీసింది. ఎపిడెర్మోలిసిస్ బులోసా అనే తీవ్రమైన చర్మవ్యాధితోనూ..నరాల బలహీనతతోనూ బాధపడే కుమార్తె లలిత(25) కూడా భర్త మరణించిన 3ఏళ్లకు మరణించింది. మానసిక స్ధితి కూడా సరిగా లేని కూతురు లలిత వైద్యం కోసం సుధ చేయని ప్రయత్నం లేదు. ఆమె ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.. అవేమీ ఫలించలేదు. చివరికి ఆమె ఒంటరి అయ్యింది. వాస్తవానికి సుధ,జనార్ధన్ లకు పెళ్ళైన కొత్తలోఒక బాబు పుట్టాడు. ఆ బాబుకు ఆరోగ్యం సరిగాలేక  పుట్టిన నెల రోజుల్లోపే కన్నుమూశాడు. 

తర్వాత పుట్టిన పాప లలిత కూడా అనారోగ్యంతో 25 ఏళ్ల వయస్సులోనే మరణించటం ఆమె జీవితాన్నికుంగదీసింది. కొన్నాళ్లు మానసికంగా బాధ పడినప్పటికీ ఈ కష్టాలను అధిగమించేందుకు సుధ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు. తన భర్త ఆశయాన్ని నెరవేర్చేందుకు నడుం కట్టారు. తనకు వచ్చిన కష్టం  పగవాడి కుటుంబంలోకూడా రాకూడదని సంకల్పించారు. భర్త స్ధాపించిన రెండు ఛారిటబుల్ ట్రస్టుల ద్వారా సేవ చేయటం ప్రారంభించారు. జానర్ధన్ రాజాజీ నగర్ లోని శ్రీఅరబిందో కాలేజీలోనిర్నించిన లైబ్రరీలోని పుస్తకాలు చదివి అసంపూర్తిగా ఉన్న డిగ్రీని పూర్తి చేశారు. 

భర్త ఆశయం
జనార్ధన్ 1970ల్లో సీఏ చేయటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పట్లో సీఏ చేయాలనుకునే విద్యార్ధుల సంఖ్యకూడా తక్కువగా ఉండేది. సీఏ పై ఆసక్తి ఉన్నవారికి ప్రోత్సాహం ఇచ్చి వారిని కల సాకారం చేయాలని జనార్దన్ కలగనేవారు. భర్త కల సాకారం చేయాలని నిర్ణయించుకున్న సుధ  బెంగుళూరు రాజాజీనగర్ లో ఉన్న తమ ఇంటిని  ఛార్టర్డ్ అకౌంట్స్ సంస్థకు విరాళంగా ఇచ్చేశారు. అప్పటిలోనే దాని విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.10 కోట్లు చేస్తుంది.  ఛార్టర్డ్ అకౌంట్స్ సంస్థ అక్కడున్నపాతబిల్డింగ్ ను పడగొట్టి జనార్ధన్ పేరుతో కొత్త బిల్డింగ్ ను నిర్మిస్తోంది.

ప్రాక్టీస్ లో ఎంత బిజీ గా ఉన్నప్పటికి తాను సంపాదించిన దానిలో కొంత దాన ధర్మాలకు ఖర్చు చేయాలనుకునే జనార్ధన్ సుధను వివాహాం చేసుకోటానికి ముందే రెండు  స్వఛ్ఛంద సంస్థలను స్థాపించారు. సాధు ఫౌండేషన్ ట్రస్ట్, మరియు శ్రీ వెంకటేశ్వర ట్రస్టు పేరుతో అవి  నిర్వహింపబడుతున్నాయి. ఇప్పడు సుధ కూడా ఈ ట్రస్ట్లుల ద్వారా నెలకు సుమారు 5,6 లక్షల రూపాయలు వివిధ రంగాలకు విరాళాలుగా అందిస్తున్నారు. తన భర్త కోరుకున్నది ఇదే..నేను అదే చేస్తున్నాను అంటారు  సుధ చిరునవ్వుతో. 

కిడ్వాయి క్యాన్సర్ ఆసుపత్రికి (ప్రతి నెలా రూ .2 లక్షలు), మొబిలిటీ ఇండియాకు (ప్రతి నెలా రూ .1.5 లక్షలు)  సుధ విరాళం ఇస్తున్నారు. ఇవి కాక శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మరియు బెంగళూరులోని సెయింట్ జాన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు కూడా విరాళాలు అందచేస్తున్నారు. చర్మావ్యాధుల నిర్మూలనకోసం  ఏర్పాటు చేసిన కేరళ… కాసర్ గోడ్ లో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ డెర్మటాలిజీకి(ఐఎడి) ఆమె గత 10 సంవత్సరాలుగా విరాళం ఇస్తున్నారు.

2019-20 ఆర్దిక సంవత్సరం 10 నెలల్లో సుధ ఐఎడికి రూ.16 లక్షలు విరాళంగా ఇచ్చారు.  ఈనిధులతో 193 మంది రోగులకు వైద్యులు సేవ చేశారు.  2018 లో సుధ  ఇచ్చిన 15 లక్షల రూపాయలతో 236 మంది రోగులకు IAD  లో ఉచితంగా చికిత్స అందించారు.   సుధ ఐఎడి ని సందర్శించినప్పుడు అక్కడి అధికారులు ఆమె ఇచ్చిన విరాళాలను ఎలా ఖర్చు చేశారో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆమెకు వివరించారు.  కర్ణాటకలోని మదానేర్ ప్రాంతంలో బోదకాలు నివారణ కోసం  రూ.20 లక్షల రూపాయలఎండోమెంట్ ఫండ్ ను ఆమె ప్రకటించారు. మదానేర్ ను ప్రపంచ ఆరోగ్య సంస్ధ బోదకాలు వ్యాధిగ్రస్త గ్రామంగా గుర్తించింది.  

మరోవైపు తమిళనాడులోని తోరపల్లిలో 50 పాఠశాలల్లో బాల బాలికల కోసం సుధ మరుగుదొడ్లు నిర్మించారు.  జనార్ధన్ 1996 లో తిరుపతిలో ఇల్లుకొనుక్కోవాలి అనుకున్నారు. కానీ  ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. జనార్ధన్ కోరిక మేరకు  తిరుపతిలో భక్తుల సౌకర్యార్ధం కాటేజీల నిర్మాణానికి 3.5 కోట్లు  సుధ విరాళంగా ఇచ్చారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రు.80 లక్షల వ్యయంతో  వికలాంగ విద్యార్ధుల కోసం  ఆమె హాస్టల్ నిర్మించారు.  గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయంలో  రెండు తులాభారం కౌంటర్లను ఏర్పాటు చేశారు.  తాను చేస్తున్న దానాల గురించి మాట్లాడుతూ సుధ… దేవుడు నాకు ఇచ్చినదాని దారిలోనే నేను ప్రయాణిస్తున్నాను అంటారు. 

 

సీఎ విద్యార్ధుల కోసం విరాళంగా ఇచ్చిన జనార్ధన్ ఇల్లు
janardhan house

తమిళనాడులోని కృష్ణనగర్ జిల్లా, హోసూరు తాలూకా, లోని 50 స్కూళ్ళలో నిర్మించిన టాయిలెట్స్  

toilets