ఈ ఒక్క దృశ్యం చాలు.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. బెడ్లు ఫుల్ అయ్యాయి. జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తారు. ఆసుపత్రిలోని కొన్ని దృశ్యాలు గమనిస్తే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి కల్లోల పరిస్థితులు సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఒక్క దృశ్యం చాలు.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి

Two Corona Patients On One Bed

2 Corona Patients On One Bed In Nagpur : మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. బెడ్లు ఫుల్ అయ్యాయి. జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తారు. ఆసుపత్రిలోని కొన్ని దృశ్యాలు గమనిస్తే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి కల్లోల పరిస్థితులు సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

కరోనా రోగులు జీఎంసీ ఆసుపత్రికి పోటెత్తారు. కానీ అందరికి వైద్యం అందించేందుకు సరిపడ బెడ్లు లేవు. దీంతో చేసేదేమీ లేక ఒకే బెడ్ పై ఇద్దరు కరోనా రోగులకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అత్యవసర చికిత్స అందించాల్సి రావడం, ఆలస్యం అయ్యే కొద్దీ రోగుల ఆరోగ్య పరిస్థితి దిగజారి పోవడంతో చేసేదేమీ లేక ఒకే పడకపై ఇద్దరికి వెంటిలేటర్ల ఏర్పాటు చేశారు.

ఆసుపత్రిలో భౌతిక దూరం అన్నదే సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి అవుతూ రోగులు చేస్తున్న ఆర్తనాదాలు, వారికి చికిత్స అందించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్న డాక్టర్లు, నర్సులు. తమ వారిని చూడమంటే తమ వారిని చూడమంటూ రోగుల బంధువులు చేస్తున్న విజ్ఞప్తులు.. ఇలా ఆ ఆసుపత్రిలో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి.

భారత్‌లో కరోనా ఉగ్రరూపం:
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. భారీగా ప్రాణాలను హరిస్తోంది. బుధవారం(ఏప్రిల్ 14,2021) రెండు లక్షలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు గురువారం(ఏప్రిల్ 15,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

2లక్షలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలు:
గడిచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564 కి చేరగా.. 1,73,123 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. రోజువారి కేసుల సంఖ్య దాదాపు 10 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 14,71,877 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. యాక్టివ్ కేసుల రేటు పది శాతానికి చేరువై కలవరపెడుతోంది. నిన్న ఒక్కరోజే 93,528 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య కోటీ 24 లక్షలను దాటేసింది.

అమెరికా తర్వాత ఇండియానే:
ఫిబ్రవరిలో 97 శాతానికి పెరిగిన రికవరీ రేటు.. ఇప్పుడు 88.92 శాతానికి పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్ మాత్రమే ఉన్నాయి. గతంలో అమెరికాలో ఒకే రోజు అత్యధికంగా మూడు లక్షలకు పైగా రోజూవారీ కేసులు బయటపడగా.. తాజాగా భారత్‌లో ఒకే రోజు అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య రెండు లక్షలకు పైబడింది. దేశవ్యాప్తంగా మూడు దశల్లో నడుస్తోన్న టీకా కార్యక్రమం కింద నిన్న 33,13,848 మందికి కేంద్రం వ్యాక్సిన్లను అందించింది. ఇప్పటి వరకు 11,44,93,238 టీకా డోసులను పంపిణీ చేసింది.

శవాల గుట్టలు, స్మశానాలు ఫుల్.. రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు..
మహారాష్ట్రలో కొద్దిరోజులుగా 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 58వేల 952 మందికి కరోనా సోకగా.. 278 మంది మరణించారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఢిల్లీని కొవిడ్ మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుట్టలుగా శవాలు పేరుకుపోతున్నాయని, శ్మశానవాటికల్లో జాగా ఖాళీలేదనే వార్తలు కలచిచేస్తున్నాయి. అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్ కూడా ఇప్పుడు మహారాష్ట్రకు తోడైనట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 20వేల 439 కొత్త కేసులు బయటపడ్డాయి. ఢిల్లీ పరిస్థితి అలాగే ఉంది. అక్కడ 17,282 మందికి కరోనా సోకింది. మహారాష్ట్ర(278), చత్తీస్‌గఢ్‌(120), ఢిల్లీ(104) మరణాలు సంభవించాయి. ప్రభుత్వం తెలుపుతున్న మృతుల సంఖ్యకు, వాస్తవ పరిస్థితులకు చాలా అంతరం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.