ఐసోలేషన్ వార్డులోనే పరీక్షలు రాసిన కరోనా పాజిటివ్ నర్సులు..

  • Published By: nagamani ,Published On : June 23, 2020 / 08:41 AM IST
ఐసోలేషన్ వార్డులోనే పరీక్షలు రాసిన కరోనా పాజిటివ్ నర్సులు..

కరోనా సోకిన ఇద్దరు  నర్సులు పరీక్ష రాశారు. అదేంటీ కరోనా సోకిందనే అనుమానం ఉన్నవారినే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తుంటే..కరోనా పాజిటివ్ వచ్చినవారిని పరీక్షా కేంద్రాలకు వచ్చి పరీక్షలు  రావటమేంటీ అను భయపడొచ్చు. కానీ..వాళ్లు పరీక్షలు రాసింది ఐసోలేషన్ వార్డులోనే. పంజాబ్ లోని పాటియాలా రాజేంద్ర హాస్పిటల్ లో కాంట్రాక్ట్ న‌ర్సుగా చేస్తున్న ఇద్ద‌రు మహిళలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో  ఐసోలేషన్ వార్డులో కరోనా చికిత్స పొందుతున్న నర్సులిద్దరు పరీక్ష రాయటం విశేషంగా మారింది.

వివరాల్లోకి వెళితే..పాటియాలా రాజేంద్ర హాస్పిటల్ లో కాంట్రాక్ట్ నర్సులుగా జాయిన్ అయి కరోనా రోగులకు సేవలుచేస్తున్నారు.కాంట్రాక్ట్ వర్కర్స్ గా పనిచేస్తున్నవారు గ‌వ‌ర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవ‌డానికి ప్ర‌తిరోజూ డ్యూటీ అయ్యాక చ‌దువుకునేవారు. ఇంత‌లోనే వారిద్దరికీ క‌రోనా సోకింది. దీంతో వారు అక్కడే ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందున్నారు. ఈక్రమంలో ప‌రీక్ష‌లు షెడ్యూల్ జూన్ 21 అని చెప్పారు. 

దీంతో వారిద్దరూ..తాము ఇద్దరు నర్సులు పరీక్ష రాయటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. దయచేసి మేము పరిక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలనికోరారు. 

దీంతో ప్రత్యేక నిబంధనలతో..ఐసోలేషన్ వార్డులోనే వారు పరీక్షలు రాయటానికి  సీఎం అనుమతిని ఇవ్వటంతో వారు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఐసోలేషన్ వార్డులోనే కూర్చుని వారు పరీక్షలు రాశారు.