గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక్కో బెడ్ పై ఇద్దరు కరోనా పేషెంట్లు

దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గతంతో పోల్చితే రెండో దశ వ్యాప్తి అసాధారణంగా ఉంది.

గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక్కో బెడ్ పై ఇద్దరు కరోనా పేషెంట్లు

2 Covid Patients In Same Bed In Viral Photos From Nagpur Hospital

2 Covid Patients దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గతంతో పోల్చితే రెండో దశ వ్యాప్తి అసాధారణంగా ఉంది. రికార్డుస్థాయిలో కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ముఖ్యంగా ముంబై,నాగ్ పూర్ ప్రాంతాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నారు. కోవిడ్-19 రోగులతో అక్కడి హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. అక్కడ కోవిడ్-19 తీవ్రతకు అద్దంపట్టే ఓ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

నాగ్‌పూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌(GMCH)లోని ఓ బెడ్‌పై ఇద్దరు కోవిడ్ రోగులున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ హాస్పిటల్‌లోని దాదాపు అన్ని బెడ్‌లను.. ఇద్దరికి రోగులకు ఒకటి చొప్పున కేటాయించారు. ఫోటోలు వైరల్ అవడంతో ఉద్దవ్ సర్కార్ పై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కరోనా విలయతాండం చేస్తుంటే, ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రకాంత్ బవన్‌కులే విమర్శించారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ లో కోవిడ్ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులు భారీగా ఉండటంతో ఎక్కువగా ప్రభుత్వ హాస్పిటల్స్‌కే వస్తున్నారని..పరిస్థితి విషమంగా ఉన్న రోగులను ప్రభుత్వ హాస్పిటల్ కు రిఫర్ చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. టూ ఇన్ ఒన్ బెడ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జీఎంసీహెచ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న కోవిడ్ రోగులు, పరిస్థితి విషమంగా ఉన్నవారిని నగరంలోని శివారు ప్రాంతం నుంచి తీసుకొచ్చి హాస్పిటల్‌లో చేర్చుకుంటున్నట్టు జీసీఎంహెచ్ మెడికల్ సూపరింటిండెంట్ అవినాశ్ గవాండే తెలిపారు. హాస్పిటల్‌లో పనిభారం చాలా ఎక్కువగా ఉందని.. బెడ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పారు.